అర్హులకు.. ఆసరా

ABN , First Publish Date - 2020-03-23T10:27:10+05:30 IST

అర్హులకు.. ఆసరా

అర్హులకు.. ఆసరా

సూర్యాపేట(కలెక్టరేట్‌), మార్చి22 : ఆసరా లబ్ధిదారులకు తీపి కబురు. ఏడాదికి పైగా పింఛన్‌ మంజూరుకు ఎదురుచూస్తున్న వారి కలలు ఫలించనున్నాయి. జిల్లాలో త్వరలో కొత్తగా ఆసరా లబ్ధిదారులకు పింఛన్‌ అందించనున్నారు. పింఛన్‌ అర్హత వయసు 57కు కుదించడంతో లబ్ధిదారుల సంఖ్య పెరగనుంది. జిల్లాలో ప్రస్తుతం 65ఏళ్లు ఉన్న వారినే  ఆసరా పథకానికి అర్హులు పరిగణిస్తూ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. 2018 శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ మరోమారు తాము అధికారంలోకి వస్తే వికలాంగుల పిం ఛను రూ.1,500నుంచి రూ.3,016, వితంతువులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, చేనేత కార్శికులు, గీత కార్శికుల పింఛను రూ.1,000నుంచి రూ.2,016 లుకు రెట్టింపు చేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటనతో పాటుగా ఆసరా పింఛను అర్హత వయసును 65ఏళ్ల నుంచి  57ఏళ్లకు తగ్గిస్తామని హామీనిచ్చింది.


జూన్‌ మొదటి వారం నుంచి పెంచిన ఆసరా పిం ఛను అమలు చేసి, అర్హులకు అందిస్తోంది. కానీ ఆసరా పింఛను అర్హత వయసును 65 నుంచి 57ఏళ్లకు తగ్గించలేదు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ నేరవేరలేదు. వరస ఎన్నికల కారణంగా ఎన్నికల కోడ్‌ అమలులో ఉండడంతో ఆసరా పింఛన్ల వయస్సు తగ్గింపుపై సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యమైంది. తాజాగా ఎన్నికల నాటి హామీకి కార్యరూపం దాల్చారు. ప్రస్తుతం జిల్లాలో ఆసరా పింఛను పొందుతున్న వితంతువులు 54,300మంది, వికలాంగులు 20,092 మంది, గీత కార్శికులు 6,913మంది, వృద్ధులు 46,656 మంది, చేనేత కార్శికులు 905మంది, ఒంటరి మహిళలు 6,642మంది ఉన్నారు. రెట్టింపు చేసిన పింఛను అమలు చేస్తూ జిల్లా అధికారులు ప్రతి నెల ఆసరా పింఛనుదారులకు రూ.31.27కోట్లు వారి బ్యాంకు ఖాతాలో జమచేసి, పోస్టాఫీసులతో లబ్ధిదారులకు పింఛను అందిస్తున్నారు.


20997 మందికి లబ్ధి 

ఆసరా పింఛను అర్హత వయసు తగ్గించడంతో జిల్లాలో అర్హులు ఆశగా ఎదురు చూ స్తున్నారు. ప్రభుత్వం ఆసరా పింఛను వయ సును 65ఏళ్ల నుంచి 57ఏళ్లకు తగ్గించడంతో జిల్లాలో సుమారుగా 20997 మందికి ఆసరా పింఛను లభించే అవకాశముంది. లబ్ధిదారుల ఓటరు కార్డులో పేర్కొన పుట్టిన తేదీ ఆధారంగా ఇప్పటికే జిల్లా గ్రామీణాఽభివృద్ధి శాఖ అధికారులు లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసి, వారి వివరాలను ఆన్‌లైన్‌ చేశారు. త్వరలో అర్హులైన వారికి నెలకు రూ.2016చొప్పున పింఛన్‌ అందనుంది.


ప్రభుత్వం పై అదనపు భారం..

ఆసరా పింఛన్‌ అర్హత వయస్సును 57ఏళ్ల కు తగ్గింపుతో ప్రభుత్వంపై అదనపు భారం పడే అవకాశముంది. జిల్లాలో ఉన్న వివిధ రకాల పింఛను లబ్ధిదారులకు ప్రతి నెల రూ. రూ. 31.27కోట్లు ప్రభుత్వం చెల్లిస్తోంది. ఆసరా పింఛను వయస్సు 57 సంవత్సరాలకు తగ్గింపు చేయడం వలన ప్రతి నెల సూమారుగా రూ.4కోట్లకు పైగా ఆర్థిక భారం ప్రభుత్వం భరించాల్సి వస్తుందని అధికారులు తెలియజేస్తున్నారు.

Updated Date - 2020-03-23T10:27:10+05:30 IST