సకలం బంద్‌

ABN , First Publish Date - 2020-03-23T10:21:13+05:30 IST

సకలం బంద్‌

సకలం బంద్‌

  • మార్చి31వరకు అత్యవసర సర్వీసులు మినహా అన్నీ బంద్‌
  •  నిత్యావసరాలు, పాలు, కూరగాయలకు ఇంటికి ఒకరే బయటకు అనుమతి
  •  ఐదుగురికంటే ఎక్కువ గుమిగూడటం నిషేధం
  •  తెల్లరేషన్‌కార్డుకు రూ.1500 నగదు
  •  నెలకు ఒక్కరికి 12 కిలోల బియ్యం

(ఆంధ్రజ్యోతి-యాదాద్రి): ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న క రోనా వైర్‌సను కట్టడికి ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. కరోనా వ్యాప్తి దశను అరికట్టడంలో భాగంగా సామాజిక కలయికను తగ్గింపునకు రాష్ట్రంలో లాక్‌డన్‌  ప్రకటించింది. ఈ నెలాఖరు వరకు పాలు, కూరగాయలు, నిత్యావసరాలు, మందుల వంటి అత్యవసరా లు తప్ప పూర్తిగా బంద్‌ చేస్తున్నారు. దాదాపు బయటకు వెళ్లకుండా పటిష్టమైన చర్యలు చే పట్టారు. దానిలో భాగంగా  ప్రతి ఇంటికి ని త్యావసరాల కోసం ఒక్కరు మాత్రమే బయటకు రావాలని ఆంక్షలు విధించారు. ఐదుగురి కంటే ఎక్కువగా ఎక్కడా గుమిగూడకుండా క ఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ప్రజా రవాణా వ్యవస్థను పూర్తిగా నిలిపివేస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప ప్రైవేట్‌ వాహనాలను అనుమతించమని ప్రభుత్వం ప్రకటించి ంది. వైద్య, రెవెన్యూ, పారిశుధ్య, నీటి సరఫరా మినహా ఇతర ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు బంద్‌ చేయనున్నారు. దీంతో దాదాపు ఈ నెలాఖరు వరకు ప్రజలు గృహ నిర్బంధానికి ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించింది 


పేదలకు ప్రభుత్వం చేయూత

కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి ప్ర భుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ నుంచి పేదల ను ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు అమలు చేయనుంది. జిల్లాలోని తెల్ల రేషన్‌కార్డుదారులకు  ఒక్కొక్కరికి 12కిలోల బియ్యం, కుటుంబానికి రూ.15వేలు అందించనుంది. జిల్లాలో ప్రస్తుతం పౌర సరపరాల శాఖ లెక్క ల ప్రకారం 2,00,286 కు టుంబాలకు తెల్లరేషన్‌ కార్డు లు ఉన్నాయి, మరో 13,706 అంత్యోదయ రేషన్‌ కార్డుదారులు ఉన్నారు. ఈ కుటుంబాల్లో 6,67,113మంది లబ్ధి దారులు ఉన్నారు. ప్రస్తుతం ప్ర తి వ్యక్తికి నెలకు 6కిలోల చొప్పున జిల్లాలో 4260.85క్వి ంటాళ్లు పంపిణీ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం లాక్‌డౌన్‌ చేసినందున ఈ కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు.


దీని ప్రకారం జిల్లాలో 8,521.30 క్వింటాళ్ల బియ్యం అందించనున్నారు. అదేవిధ ంగా కుటుంబానికి రూ.1500 చొప్పున రూ.32కోట్ల09లక్షల88వేలు ని త్యావసర వస్తువులు సమకూర్చుకోవడానికి పంపిణీ చేయనున్నారు. కరోనా వైర్‌సను రెండో దశ నుంచి ముందుకు పోకుండా అవసరమైన కఠిన చర్యల కారణంగా లాక్‌డౌన్‌ కారణంగా ప్రత్యేక చర్యలు అమలు కానున్నా యి. దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి జనతా కర్ఫ్యూను పాటించిన వెంటనే తదుపరి చర్య గా తెలంగాణ రాష్ట్రంలాక్‌డౌన్‌ ప్రకటించడంతో జిల్లాప్రజలు ఆశ్చర్యానికి లోనయ్యారు. అయి తే నిత్యావసరాలు అందుబాటులో ఉండటానికి చర్యలు తీసుకుంటామనే ప్రభుత్వ భరోసా కొంత ఉపశమనం కలిగింది. కరోనా వైర్‌సను అరికట్టడానికి అత్యవసర చర్యలు తప్పనిసరి కావడంతో అన్ని వర్గాల ప్రజలు కష్టమైనా స్వాగతించక తప్పదనే అభిప్రాయం వ్యక్తమౌతుంది.

Updated Date - 2020-03-23T10:21:13+05:30 IST