అనాథ ఆశ్రమ పిల్లలను ఆదుకున్న డా.ఆనంద్ మిత్ర బృందం

ABN , First Publish Date - 2020-04-28T19:28:19+05:30 IST

లాక్‌డౌన్ కారణంగా చాలామంది నిత్యావసరాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారిని ఆదుకునేందుకు డాక్టర్ ఆనంద్ ముందుకు వచ్చారు.

అనాథ ఆశ్రమ పిల్లలను ఆదుకున్న డా.ఆనంద్ మిత్ర బృందం

నల్గొండ: లాక్‌డౌన్ కారణంగా చాలామంది నిత్యావసరాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారిని ఆదుకునేందుకు డాక్టర్ ఆనంద్ ముందుకు వచ్చారు. తన మిత్రుల సహకారంతో బంజారా మహిళా ఎన్జీవో ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా దాదాపు 15 రాష్ట్రాల్లో సహాయక శిబిరాలు నిర్వహిస్తున్నారు. తాజాగా తన మిత్రులు  క్రిష్ణ వంగిపురం, కిరణ్ బద్దం ప్రోత్సాహంతో నల్లగొండ జిల్లాలోని స్నేహ అనాథ ఆశ్రమ పిల్లల కోసం నిత్యావసర వస్తువులను అందించారు. ఆశ్రమ నిర్వాహకురాలు కవితకు స్థానికంగా ఉన్న తన మిత్రుడు వినోద్ ద్వారా అందించారు. సహాయక శిబిరాల గురించి డాక్టర్ ఆనంద్ మాట్లాడుతూ.. తన మిత్రులందరి సహకారంతో  సహాయక శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు. కరోనా మహమ్మారిని విజయవంతంగా తరిమి కొట్టడానికి ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా భౌతిక దూరాన్ని పాటించి, వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. దాతలు ముందుకు వచ్చి తమ వంతు సహాయాన్ని పేద ప్రజల కోసం అందించాలని ఆయన కోరారు.

Updated Date - 2020-04-28T19:28:19+05:30 IST