మునిసిపాలిటీగా నకిరేకల్
ABN , First Publish Date - 2020-12-15T06:06:29+05:30 IST
నకిరేకల్ పట్టణం మునిసిపాలిటీగా మార నుంది.
నేటితో ముగియనున్న పంచాయతీ పాలన
ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో మునిసిపాలిటీ
నకిరేకల్, డిసెంబరు 14: నకిరేకల్ పట్టణం మునిసిపాలిటీగా మార నుంది. నకిరేకల్ గ్రామపంచాయతీతో పాటు మండలంలోని ఆరు గ్రామ పంచాయతీల పాలకవర్గాల పాలన ముగియనుంది. ఈ నెల 16 నుంచి నకిరేకల్ గ్రామపంచాయతీ మునిసిపాలిటీగా మారనుంది. గ్రామపంచా యతీలకు నుంచి ప్రత్యేక పాలన కొనసాగనుంది. నకిరేకల్‌తో పాటు మండలంలోని తాటికల్, కడపర్తి, నెల్లిబండ, చందంపల్లి, చందుపట్ల, నోముల గ్రామాలను కలిపి అప్పటి ప్రభుత్వం 2011 ఆగస్టు 24న నకిరే కల్‌ను మునిసిపాలిటీగా ఏర్పాటు చేసింది. నకిరేకల్ రెండేళ్ల పాటు మున్సి పాలిటీగా కొనసాగింది. నకిరేకల్ మునిసిపాలిటీ ఏర్పాటుకు అర్హత లేకుం డా 10కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలను విలీనం చేస్తూ ముని సిపాలిటీని ఏర్పాటు చేశారని, దీంతో మున్సిపాలిటీకి పన్నులు చెల్లించ లేమని విలీన గ్రామాల ప్రజలు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిం చారు. విచారించిన న్యాయస్థానం 2013 సెప్టెంబరులో నకిరేకల్ మునిసి పాలిటీని రద్దుచేసింది. గ్రామపంచాయతీగానే ఉండాలని ఆదేశించింది. 2014 పిభ్రవరిలో ఈ ఉత్తర్వులు అమల్లోకి రావడంతో 2015 డిసెంబరు 5వ తేదీన నకిరేకల్ మేజర్ గ్రామపంచాయతీతో పాటు ఆరు గ్రామపం చాయతీలకు ఎన్నికలు జరిగాయి.
2018లో మళ్లీ మునిసిపాలిటీ ఏర్పాటు
రాష్ట్ర ప్రభుత్వం 68 మునిసిపాలిటీల ఏర్పాటులో భాగంగా నకిరేకల్‌ను మళ్లీ మునిసిపాలిటీగా ఏర్పాటు చేసింది. ఈ గ్రామపంచాయతీల గడువు ముగిసే వరకు గ్రామపంచాయతీలుగానే కొనసాగాలని పేర్కొంది. ఈ నెల 15న గ్రామపంచాయతీ పాలకవర్గాల గడువు ముగుస్తున్నందున నకిరేకల్ మేజర్ గ్రామపంచాయతీ మాత్రం ఈ నెల 16వ తేదీ నుంచి మునిసిపా లిటీగా కొనసాగాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మిగతా ఆరు గ్రామాలకు మాత్రం అఽధికారులతో పాలన కొనసాగనుంది. 2018లో కొత్త పంచాయతీలు ఏర్పాటు చేయడంతో ఇన్నాళ్లు మునిసిపాలిటీ పరిధిలో ఉన్న చందంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గొల్లగూడ గ్రామానికి ఎన్నికలు నిర్వహించకపోవడంతో 16వ తేదీ నుంచి ఆ గ్రామంలో కూడా ప్రత్యేక అధికారుల పాలన కొనసాగనుంది.
తాత్కాలిక మునిసిపల్ కమిషనర్‌గా ఎంపీడీవో
నకిరేకల్ మునిసిపల్ పాలన ప్రారంభమవుతున్నందున తాత్కాలిక కమిషనర్‌గా నకిరేకల్ ఎంపీడీవో వెంకటేశ్వర్‌రావు, ప్రత్యేక అధికారిగా నల్లగొండ ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డిని నియమిస్తూ మునిసిపల్ శాఖ అధికా రికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం: వెంకటేశ్వర్‌రావు, ఎంపీడీవో
నకిరేకల్ మునిసిపాలిటీగా మారుతున్నందున ఇంతకా లం మునిసిపాలిటీ పరిధిలో ఉన్న ఆరు గ్రామాలతో పాటు నూతనంగా ఏర్పాటైన గొల్లగూడతో కలిపి ఏడు గ్రామపం చాయతీలకు ప్రత్యేక అఽధికారుల నియామకం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం.