సమరశీల పోరాటాలకు సన్నద్ధం కావాలి

ABN , First Publish Date - 2020-12-27T05:43:09+05:30 IST

దేశంలో, రాష్ట్రంలో దారి ద్య్రం, నిరుద్యోగం, అవినీతి వంటి మౌలిక సమస్యలపై సమరశీల పోరాటాలు నిర్వహించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం అన్నారు.

సమరశీల పోరాటాలకు సన్నద్ధం కావాలి
జిల్లాకార్యాలయంలో జెండా ఆవిష్కరిస్తున్న సీపీఐ జిల్లా కార్యదర్శి సత్యం

 సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం
 జిల్లావ్యాప్తంగా ఘనంగా సీపీఐ ఆవిర్భావ దినోత్సవం

ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, డిసెంబరు 26 :
దేశంలో, రాష్ట్రంలో దారి ద్య్రం, నిరుద్యోగం, అవినీతి వంటి మౌలిక సమస్యలపై సమరశీల పోరాటాలు నిర్వహించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం అన్నారు. జిల్లావ్యాప్తంగా సీపీఐ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు పార్టీ జెండాలు ఎగురవేయడంతో పార్టీ విశిష్టతను వివరించారు. సీపీఐ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం జెండా ఎగురవేసి మాట్లాడారు. మిర్యాలగూడ పట్టణంలోని సాగర్‌ రోడ్డులో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బంటు వెంకటేశ్వర్లు పార్టీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణగారిన ప్రజలకు అండ ఎర్రజెండా అని అన్నారు. దేవరకొండ పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లా నర్సింహారెడ్డి జెండా ఎగురవేశారు. కొండమల్లేపల్లి మండల కేంద్రంలో సీపీ ఐ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు పల్లా దేవేందర్‌రెడ్డి పార్టీ జెండా ఎగురవేశారు. డిండి మండల కేంద్రంలో సీపీఐ మండల కార్యదర్శి బుచ్చిరెడ్డి పార్టీ జెండా ఎగురవేశారు. చింతపల్లి, కనగల్‌, నార్కట్‌పల్లి, మర్రిగూడ, చిట్యాల, చండూ రు, మునుగోడు, నకిరేకల్‌, నాంపల్లి మండలాల్లో పార్టీ నాయకులు జెండాలు ఆవిష్కరించారు. 

Updated Date - 2020-12-27T05:43:09+05:30 IST