ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకోవాలి

ABN , First Publish Date - 2020-12-30T05:25:18+05:30 IST

ప్రైవేట్‌ ఎలక్ట్రిషన్లు మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞాణాన్ని అందిపుచ్చుకోవాలని విద్యుత్‌ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు.

ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకోవాలి
నూతన సంవత్సర క్యాలెండర్లు ఆవిష్కరిస్తున్న మంత్రి జగదీష్‌రెడ్డి

విద్యుత్‌ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి 

సూర్యాపేట(కలెక్టరేట్‌), డిసెంబరు 29: ప్రైవేట్‌ ఎలక్ట్రిషన్లు మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞాణాన్ని అందిపుచ్చుకోవాలని విద్యుత్‌ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రైవేట్‌ ఎలక్ట్రికల్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను  మంగళవారం జిల్లాకేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ త్వరలో విద్యుత్‌ కార్మికుల కోసం సూర్యాపేటలో నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కంస్ట్రక్షన్‌ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణను, నూతన భవనాన్ని ఏర్పాటు చేస్తానని తెలిపారు. విధిగా ప్రతి ఒక్కరు చేతులకు గ్లౌజ్‌లు, హెల్మెంట్‌లు ధరించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ళ అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, వ్యవసాయ మార్కెట్‌ చైర్‌ పర్సన్‌ ఉప్పల లలితాదేవిఆనంద్‌, ఒంట్టెద్దు నర్సింహ్మారెడ్డి, వై. వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ జీడి బిక్షం, కౌన్సిలర్‌ లక్ష్మిమకట్‌లాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-30T05:25:18+05:30 IST