నిండుగా ప్రవహిస్తున్న మూసీ

ABN , First Publish Date - 2020-10-14T14:58:21+05:30 IST

రెండు రోజులుగా హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నది నిండుగా ప్రవహిస్తోంది.

నిండుగా ప్రవహిస్తున్న మూసీ

యాదాద్రి- భువనగిరి: రెండు రోజులుగా హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నది నిండుగా ప్రవహిస్తోంది. వర్షపు నీటితో అమ్మనబోలు బ్రిడ్జ్ మునిగిపోయింది. దీంతో నార్కట్ పల్లి-మోత్కూర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వలిగొండ మండలం కేంద్రంలో మూసీ నది ఒడ్డున పలు లారీలను పార్క్ చేయగా... రాత్రి మూసీ నది ఉదృతి పెరగడంతో ప్రవాహంలో లారీలు,  సుమో చిక్కుకు పోయాయి. లారీలు ధాన్యం రావాణా కోసం ఇతర ప్రాంతాల నుండి వచ్చినట్లు తెలుస్తోంది.

Updated Date - 2020-10-14T14:58:21+05:30 IST