మూసీ ప్రాజెక్ట్‌కు తగ్గుతున్న వరద

ABN , First Publish Date - 2020-10-23T16:21:12+05:30 IST

జిల్లాలోని మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గుముఖం పడుతోంది. నాలుగు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

మూసీ ప్రాజెక్ట్‌కు తగ్గుతున్న వరద

నల్గొండ: జిల్లాలోని మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గుముఖం పడుతోంది. నాలుగు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్  పూర్తిస్థాయి నీటిమట్టం 645.00 అడుగులకు గాను... ప్రస్తుత నీటిమట్టం 641.40 అడుగులకు చేరింది. అలాగే ఇన్ ఫ్లో 9,943 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 12,369 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ  4.46 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 3.54 టీఎంసీలుగా నమోదు అయ్యింది. 

Updated Date - 2020-10-23T16:21:12+05:30 IST