మూసీ ఆయకట్టులో సాగు సందడి
ABN , First Publish Date - 2020-12-17T05:59:00+05:30 IST
కేతేపల్లి, డిసెంబరు 16: కేతేపల్లి, డిసెంబరు 16: కాల్వల ఆయకట్టులో యాసంగి పంటల సాగుకు రైతాంగం సమాయత్తమయ్యింది.

మూసీకి నీటి విడుదల
కేతేపల్లి, డిసెంబరు 16: కాల్వల ఆయకట్టులో యాసంగి పంటల సాగుకు రైతాంగం సమాయత్తమయ్యింది. మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు సాగునీటి విడుదలతో ఆయకట్టులో పంటల సాగు సందడి నెలకొంది. ఈ ఏడాది మూసీ ఆయకట్టులో యాసంగి పంటల సాగుకోసం నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేశారు. ఏటా డిసెంబర్ 18నుంచి ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేసేవారు. ఈ ఏడాది ఖరీఫ్ ఆరంభం నుంచి కురుస్తున్న వర్షాలకు మూసీ ప్రాజెక్టు నీటితో నిండుకుండలా ఉంటూవస్తోంది. దీంతో ఈ ఏడాది ముందస్తుగా ఆయకట్టులోని దాదాపు 35వేల పైచిలుకు ఎకరాలకు సాగునీటిని అందించాలన్న జిల్లా మంత్రి జగదీ్‌షరెడ్డి సూచనతో అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు ఈ నెల15న సాగునీటిని విడుదల చేశారు. ఈ క్రమంలో ఇటీవలి వరకూ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు విడుదలైన నీటితో రైతులు వరి నార్ల పెంపకం చేపట్టారు. షెడ్యూలు ప్రకారం కాల్వలకు అధికారికంగా నీటిని వదలడంతో రైతులు సాగులో బిజీ అయ్యారు.