యాదాద్రి రహదారి పనుల విస్తరణలో కదలిక
ABN , First Publish Date - 2020-10-07T11:04:41+05:30 IST
యాదాద్రి జిల్లా కేంద్రం భువనగిరి పట్టణ ప్రధాన రహదారి విస్తరణ పనుల్లో కదలిక వచ్చింది. నాలుగేళ్ల క్రితం సీఎం కేసీఆర్ భువనగిరి పర్యటనలో ఈ రహదారి

నాలుగేళ్లుగా వాయిదా పడుతున్న విస్తరణ
కేటీఆర్ పర్యటనతో వేగంపెంచిన అధికారులు
నెరవేరనున్న సీఎం కేసీఆర్ హామీ
112 వృక్షాల తొలగింపునకు అటవీశాఖ అనుమతి
పూర్తికావొచ్చిన భూసేకరణ
త్వరలో ప్రారంభంకానున్న పనులు
భువనగిరి టౌన్ :
యాదాద్రి జిల్లా కేంద్రం భువనగిరి పట్టణ ప్రధాన రహదారి విస్తరణ పనుల్లో కదలిక వచ్చింది. నాలుగేళ్ల క్రితం సీఎం కేసీఆర్ భువనగిరి పర్యటనలో ఈ రహదారి విస్తరణకు హామీ ఇచ్చారు. ఇటీవల మునిసిపల్ శాఖా మంత్రి కేటీఆర్ భువనగిరి పర్యటనలో ఈ రహదారి విస్తరణ పనులు త్వరగా చేపట్టి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో దస రా లేదా దీపావళి అనంతరం పనులు ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రూ.25 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రహదారికి ఇరువైపులా ఉన్న 112 వృక్షాల తొలగింపునకు అటవీశాఖ అనుమతి ఇచ్చింది. వాస్తవానికి గత ఏడాదే విస్తరణ పనులు పూర్తికావాల్సి ఉండగా, పలు కారణాలతో వాయిదాపడుతూ వచ్చింది. ఈ పనులను హెచ్‌ఎండీఏ చేపట్టాల్సి ఉండగా, జాప్యం కారణంగా మునిసిపాలిటీకి అప్పగి స్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం 70 నుంచి 80 ఫీట్లుగా ఉన్న హైదరాబాద్-వరంగల్ ప్రధాన రహదారిని వంద ఫీట్లుగా అభివృద్ధి చేయనున్నారు. దీంతో ట్రాఫిక్, పార్కింగ్ ఇబ్బందులు ప్రమాదాలు తప్పనున్నాయి.
పనులు ఇలా..
భువనగిరి పట్టణ శివారులోని మారుతీ షోరూం నుంచి మిల్క్‌సెంటర్ వర కు సుమారు 6.2కి.మీ మేర వందఫీట్లుగా రహదారిని విస్తరించనున్నారు. హైదరాబాద్ చౌరస్తా, జగదేవ్‌పూర్ చౌరస్తా, వినాయక చౌరస్తా, పాతబస్టాండ్ చౌరస్తాను విస్తరించి సర్కిళ్లు నిర్మిస్తారు. సుందరీకరణలో భాగంగా ఫౌంటెన్లు ఏర్పాటు చేస్తారు. రహదారి మధ్యన డివైడర్ నిర్మా ణం, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుతోపాటు గ్రీనరీని అభివృద్ధి చేస్తారు. రోడ్డుకు ఇరువైపులా ఫుట్‌పాత్‌లు నిర్మిస్తారు. ప్రస్తుతం రెండు చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండగా, మిగతా చోట్ల కూడా వీటిని ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా నిఘా కోసం సీసీ కెమెరాలు బిగించనున్నారు. ఇప్పటి వరకు డివైడర్, సెంట్రల్ లైటింగ్, గ్రీనరీ, కల్వర్టుల నిర్మాణ పనులు కొంతమేర పూర్తయ్యాయి.
భూముల స్వాధీనం
ప్రస్తుతం రహదారికి ఇరువైపులా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ సంస్థలు, ప్రైవేటు వ్యక్తుల ఆధీనం లో ఉన్న 26,600.22 చదరపు అడుగుల భూమిని అధికారులు పూర్తిస్థాయిలో త్వరలో స్వాధీనం చేసుకోనున్నారు. ఇందులో 12 ప్రభుత్వ కార్యాలయాల స్థలం 7,206.01 చదరపు అడుగులు కాగా, మిగతా 19,394.21 చదరపు అడుగులు ఇతరులవి. తొమ్మిది ప్రార్థనా స్థలాల భూము లు ఉండగా, 359భవనాలు, 90ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి.
112 చెట్ల తొలగింపు
రోడ్డు విస్తరణ కోసం ప్రధాన రహదారి వెంట 112 వృక్షాలు తొలగించనున్నారు. అందుకు హెచ్‌ఎండీఏ చేసి న దరఖాస్తునకు అటవీశాఖ అనుమతి ఇచ్చింది. నిబంధనల మేరకు ఒక్కో వృక్షం తొలగించినందుకు 20 మొక్క లు నాటి సంరక్షించాల్సి ఉంటుంది. అంటే 112 చెట్ల తొలగింపునకు 2240 మొక్కలు నాటాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా, భారీ వృక్షాలను ట్రాన్స్‌ప్లాంటేషన్ విధానంలో నాటే ఆలోచనను సైతం అధికారులు చేస్తున్నారు. అందు కు ఒక్కోచెట్టుకు కనీసం రూ.30వేలు వ్యయం కానుంది.
హెచ్‌ఎండీఏ నుంచి మునిసిపాలిటీకి
రోడ్డు విస్తరణ పనులను హెచ్‌ఎండీఏ నిర్వహించాల్సి ఉండగా, భూములు సేకరణను మాత్రం మునిసిపాలిటీ చేపట్టాలని హెచ్‌ఎండీఏ అధికారులు నిబంధన విధించడం తో పనుల్లో ఏళ్ల తరబడిగా జాప్యం ఏర్పడింది. దీంతో ఎమ్మెల్యే ఫైౖళ్ల చొరవ తీసుకొని గతనెల హెచ్‌ఎండీఏ, ము నిసిపల్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. సమ స్య పరిష్కారానికి మునిసిపాలిటీనే భూసేకరణ, విస్తరణ పనులను చేపట్టేలా ఒప్పించి, హెచ్‌ఎండీఏ ఖాతాలో ఉన్న నిధులు మునిసిపాలిటీకి బదిలీ చేయించారు.
యాదాద్రి కొండపైకి మరో ఫ్లైఓవర్
యాదాద్రి టౌన్: యాదాద్రి ఆలయ విస్తరణలో భాగం గా కొండపైకి మరో ఫ్లైఓవర్‌ను వైటీడీఏ నిర్మిస్తోంది. కొండకింద గండి చెరువు, ప్రెసిడెన్షియల్ సూట్ నుంచి రింగురోడ్డు మార్గం ద్వారా వచ్చిన భక్తులు కొండపైకి త్వ రితగతిన చేరుకునేలా ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరపాలని ఇటీవల సీఎం సూచించారు. ఆ మేరకు రూ.143కోట్లు నిధులు మంజూరు కాగా, ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ఆర్‌అండ్ బీ అధికారులు ప్రారంభించారు. కొండకింద రింగురోడ్డు నుంచి గిరిప్రదక్షిణ రహదారిపై నుంచి రెండో ఘాట్‌రోడ్డు కు అనుసంధానం చేసేలా ఈ ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. సుమారు 450 మీటర్ల పొడవు, 14మీటర్ల వెడల్పుతో 21పిల్లర్లతో ఫ్లైఓవర్‌ను నిర్మిస్తున్నట్లు ఆర్‌అండ్‌బీ అధికారులు తెలిపారు. అందుకు సంబంధించి పుట్టింగ్స్ పనులు పూర్తయ్యాయని, పిల్లర్ పనులు కొనసాగుతున్నాయి.