రాజ్యాంగ పరిరక్షణ కోసం ఉద్యమించాలి

ABN , First Publish Date - 2020-03-08T11:35:24+05:30 IST

రాజ్యాంగ పరిరక్షణ కోసం యువత ఉద్యమించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం పిలుపునిచ్చారు.

రాజ్యాంగ పరిరక్షణ కోసం ఉద్యమించాలి

సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం


నల్లగొండరూరల్‌, మార్చి 7: రాజ్యాంగ పరిరక్షణ కోసం యువత ఉద్యమించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో జరిగిన ఏఐవైఎఫ్‌ జిల్లా కౌన్సిల్‌ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కులం, మతం, ప్రాతీయ విద్వేషాలను రెచ్చకొడుతూ పాలన సాగిస్తోందని అన్నారు. యువతరానికి ఎన్నికల్లో చేసిన వాగ్ధానాలను అమలు చేయడంలో కేంద్రప్రభుత్వం విఫలమైందని అన్నారు. వ్యవసాయ, ఉపాధి, విద్య, వైద్య రంగాలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్‌, ప్రైవేట్‌ సంస్థలకు కొమ్ముకాస్తు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.


ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి తిర్పారి వెంకన్న మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు హైదరాబాద్‌లో ఏఐవైఎఫ్‌ జాతీయ మహాసభలను నిర్వహించనున్నట్లు తెలిపారు. మహాసభలకు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని  విజయవంతం చేయాలని కోరారు. బక్క రాజవర్దన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బుడిద సురేష్‌, లింగానాయక్‌, షరీఫ్‌, నాగయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-08T11:35:24+05:30 IST