రోడ్డు ప్రమాదంలో తల్లీకుమార్తె మృతి

ABN , First Publish Date - 2020-03-15T12:09:38+05:30 IST

చిట్యాలలో జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి, కుమార్తె గాయపడి, ఆసుపత్రిలో చికిత్స

రోడ్డు ప్రమాదంలో తల్లీకుమార్తె మృతి

చిట్యాల, మార్చి 14: చిట్యాలలో జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి,  కుమార్తె గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. చిట్యాలకు చెందిన నడిగోటి కళమ్మ, స్వప్న (25) తల్లీ కుమార్తెలు.  స్వప్నకు వివాహమైనప్పటికీ కిడ్నీ వ్యాధి కారణంగా పుట్టింటిలోనే ఉంటోంది.


చికిత్స కోసం  హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రికి వెళ్లేందుకు బస్‌ ఎక్కడానికి  చిట్యాల హైస్కూల్‌ వద్ద  జాతీయ రహదారి దాటుతుండగా నార్కట్‌పల్లి నుంచి హైదరాబాద్‌ వెళుతున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తల్లీకుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. అంబులెన్స్‌ రావడానికి ఆలస్యం అవ్వడంతో  ప్రమాదానికి కారణమయిన కారులోనే  ఇద్దరినీ నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు. 

Updated Date - 2020-03-15T12:09:38+05:30 IST