కేసులు తగ్గుతున్నా పర్యవేక్షణ కొనసాగుతుంది

ABN , First Publish Date - 2020-04-28T05:30:00+05:30 IST

కరోనా వైరస్‌ పాజిటి వ్‌ కేసులు తగ్గుతున్నా, అనుమానితులపై అధికారుల పర్యవేక్షణ కొనసాగుతుందని

కేసులు తగ్గుతున్నా పర్యవేక్షణ కొనసాగుతుంది

సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి


సూర్యాపేట (కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 27: కరోనా వైరస్‌ పాజిటి వ్‌ కేసులు తగ్గుతున్నా, అనుమానితులపై అధికారుల పర్యవేక్షణ కొనసాగుతుందని సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కట్టడి ప్రాంతమైన కుడకుడను ఎస్పీ భాస్కరన్‌తో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 14 రోజుల నుంచి కుడకుడ ప్రాంతంలో ఎటువంటి పాజిటివ్‌ కేసులు నమోదు కాకపోవడంతో రెడ్‌జోన్‌ నుంచి మినహాయింపు ఇచ్చినట్టు తెలిపారు.


ఇప్పటి నుంచి కరోనా వైరస్‌ లక్షణాలు ఉంటేనే పరీక్షల కోసం నమూనాలు సేకరిస్తామన్నారు. కుడకుడను కట్టడి జాబితా నుంచి తొలగించినా ఆరోగ్య సర్వే యథావిధిగా కొనసాగుతుందన్నారు. అన్ని ప్రాంతాల్లో 28 రోజుల పాటు ఇంటింటి సర్వే కొనసాగుతోందన్నారు. జిల్లాలో సెకండరీ కాంటాక్ట్‌ చైన్‌ తెగిపోవడంతో పాజిటివ్‌ కేసుల ఉధృతి తగ్గిందన్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాకుం డా స్వీయనియంత్రణలో ఉండాలని, ప్రతి ఒక్కరూ మాస్కులను ధరించి భౌతికదూరం పాటించాలన్నారు.


కరోనాపై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కేసులు నమో దు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట డీఎస్పీ మోహన్‌కుమార్‌, రూరల్‌ సీఐ విఠల్‌రెడ్డి, తహసీల్దార్‌ పులి సైదు లు, చివ్వెంల ఎస్‌ఐ లోకే్‌షకుమార్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-04-28T05:30:00+05:30 IST