మూడేళ్లుగా మూలకు

ABN , First Publish Date - 2020-08-18T11:03:39+05:30 IST

ఉమ్మడి జిల్లాలో 20లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయి. పంటల సాగు దుక్కుల దున్నకానికి ట్రాక్టర్లు, వాటికి కేజీవీల్‌, ..

మూడేళ్లుగా మూలకు

వ్యవసాయ యాంత్రీకరణ దుస్థితి ఇది..

రైతన్నలకు అదనంగా సాగు వ్యయం

 ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటించి రైతులు అధిక దిగుబడులు సాధించేలా ప్రోత్సహించేందుకు దశాబ్దాలుగా అమలులో ఉన్న యంత్రలక్ష్మి పథకాన్ని ప్రభుత్వం మూలన పడేసింది. రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం అందిస్తుండటంతో యంత్రలక్ష్మి పథకానికి నిధులు నిలిపివేసింది. మూడేళ్లుగా ఈ పరిస్థితి ఉండగా, రైతులకు సబ్సిడీపై ఆధునిక వ్యవసాయ యంత్రాలు అందకుండాపోతున్నాయి. ఫలితంగా రైతులపై అదనపు ఆర్థిక భారం పడుతోంది.


( ఆంధ్రజ్యోతి - యాదాద్రి): ఉమ్మడి జిల్లాలో 20లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయి. పంటల సాగు దుక్కుల దున్నకానికి ట్రాక్టర్లు, వాటికి కేజీవీల్‌, కల్టివేటర్లు, కలుపునివారణ, సస్యరక్షణ చర్యలకు స్ర్పేయర్లు, స్పింకర్లు తదితర ఆధునిక యంత్రాల అవసరం ఉంటుంది. ఆధునిక సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం యంత్రలక్ష్మి పథకాన్ని అమలు చేస్తోంది. దీని కింద ఎస్సీ, ఎస్టీ వర్గాల రైతులకు 90శాతం రాయితీపై ట్రాక్టర్లు, ఇతర పరికరాలు ప్రభుత్వం మంజూరు చేసింది. కేజీవీల్స్‌, కల్టివేటర్లు, రొటోవేటర్లు, స్ర్పేయ ర్లు, పవర్‌ స్పేయర్లు, స్పింకర్లను 50శాతం సబ్సిడీపై ఇచ్చింది. అయితే మూడేళ్లుగా యంత్రలక్ష్మి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధుల విడుదలను నిలిపివేసింది. దీంతో ట్రాక్టర్లతో పాటు కనీసం స్ర్పేయర్లు సైతం రైతులకు అందకుండా పోయాయి. మూడున్నర ఏళ్ల క్రితం మంజూరు చేసిన ట్రాక్టర్లు, ఇతర పరికరాలను సరఫరా చేసిన డీలర్లకు సైతం చెల్లింపులు చేయకపోవడంతో బకాయిలు పేరుకుపోయాయి.


నల్లగొండ జిల్లాలో సుమారు రూ.5కోట్ల బకాయిలు ఉన్నాయని డీలర్లు తెలిపారు. యాదాద్రి జిల్లాలో రూ.65లక్షలు పెండింగ్‌లో ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో సైతం బకాయిలు చెల్లించాల్సి ఉంది. రాయితీ కోసం లబ్ధిదారులు వ్యవసాయశాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోతోంది. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు జారీకాకపోవడంతో అసలు ఈ పథకం కొనసాగింపు పై సందిగ్ధం ఏర్పడింది. రైతుబంధు కారణంగానే ఈ పథకానికి నిధులు నిలిపివేసినట్టు అధికారులు చెబుతున్నారు.


రైతులపై సాగుభారం

ఉమ్మడి జిల్లాలో సాగునీటి వనరులు అందుబాటులోకి వస్తుండటంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఈనేపథ్యంలో వ్యవసాయ ఆధునిక పరికరాలు రైతులకు అవసరం. గతంలో ఊరికి రెండు, మూడు ట్రాక్టర్లు సబ్సిడీపై ఇచ్చారు. యంత్రాలు కూడా వచ్చాయి.అయితే ప్రభుత్వం రాయితీ సొమ్ము మం జూరు చేయకపోవడంతో వీటిని బహిరంగ మార్కెట్‌ లో కొనుగోలు చేయడం రైతులకు భారంగా మారింది. ప్ర స్తుత వానాకాలంలో పంటలు ఏపుగా పెరుగుతుండగా, వచ్చే ది తెగుళ్ల సీజన్‌. ఈ సమయంలో పవర్‌ స్ర్పేయర్ల అవసరంగా అధికంగా ఉంటుంది. గతంలో రెండు వేల రూపాయలకు వచ్చే స్ర్పే యర్ల ధర ఆరునుంచి ఎనిమిదివేల రూపాయలకు పెరిగింది.  ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే తక్కువ ధరకే రైతులకు స్ర్పేయర్లు అందుబాటులోకి వచ్చేవి. అదేవిఽధగా ట్రాక్టర్లకు రాయితీ ఇవ్వకపోవడంతో బ్యాంకు రుణాలు సం బంధించిన నెలసరి వాయిదాలు చెల్లించేందుకు రైతులు అప్పులు చేయా ల్సి వస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం యంత్రలక్ష్మి పథకానికి నిధులు కేటాయించి సబ్సిడీపై ట్రాక్టర్లు, యంత్రాలు, పవర్‌ స్ర్పేయర్లు ఇచ్చి ఆదుకుం టే ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని రైతులు పేర్కొంటున్నారు.


మూడేళ్లుగా సబ్సిడీ యంత్రాలు లేవు.. కె.అనురాధ, యాదాద్రి జిల్లా వ్యవసాయ అధికారి 

వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల కు ప్రభుత్వం మూడేళ్లుగా సబ్సిడీ మం జూరు చేయడం లేదు. ప్రస్తుతానికి జిల్లాలో యంత్రాల పంపిణీకి ఎటువంటి ప్రతిపాదనలు లేవు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైతే వ్యవసాయ యంత్రాలు అందించే అవకాశం ఉంటుంది. గతంతో సరఫరా చేసిన ట్రాక్టర్లకు రూ.65లక్షల వరకు డీలర్లకు బకాయిలు ఉన్నాయి. ప్రభుత్వ నిధులతోపాటు మార్గదర్శకాలు వస్తే వ్యవసాయ సంబంధి త యంత్రాలు అందించేందుకు చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2020-08-18T11:03:39+05:30 IST