మోడల్‌ స్కూల్‌ విద్యార్థులకు న్యాయం చేయాలి

ABN , First Publish Date - 2020-03-04T11:52:14+05:30 IST

మోడల్‌స్కూళ్లలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను వదిలేసి ఉపాధ్యాయులు ఇంటర్‌, టెన్త్‌ పరీక్ష విధుల్లో ఉండటం వల్ల తీరని

మోడల్‌ స్కూల్‌ విద్యార్థులకు న్యాయం చేయాలి

నల్లగొండ, మార్చి 3: మోడల్‌స్కూళ్లలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను వదిలేసి ఉపాధ్యాయులు ఇంటర్‌, టెన్త్‌ పరీక్ష విధుల్లో ఉండటం వల్ల తీరని అన్యాయం జరుగుతుందని ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌కు ఆయన వినతిపత్రం అందజేసి మా ట్లాడారు.


ఉపాధ్యాయులు పరీక్ష విధుల పేరు తో పరీక్షల సమయంలో విద్యార్థులకు అందుబాటులో ఉండకుండా వారి అనుమానాలను నివృత్తి చేయకుండా ఉండే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్‌ డ్యూటీలపై మక్కువ చూపుతూ విద్యార్థులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మోడల్‌స్కూ ల్‌ ఉపాధ్యాయులను రిలీవ్‌ చేయకుండా ఆయా పాఠశాలల పరిధిలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. 

Updated Date - 2020-03-04T11:52:14+05:30 IST