కొత్త రెవెన్యూ చట్టంతో రైతాంగానికి మేలు

ABN , First Publish Date - 2020-09-13T09:41:28+05:30 IST

కొత్త రెవెన్యూ చట్టంతో రైతాంగానికి మేలు జరుగుతుందని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు.

కొత్త రెవెన్యూ చట్టంతో రైతాంగానికి మేలు

హుజూర్‌నగర్‌/ మఠంపల్లి, సెప్టెంబరు 12: కొత్త రెవెన్యూ చట్టంతో రైతాంగానికి మేలు జరుగుతుందని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. హుజూర్‌నగర్‌ టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. రైతాంగానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. భూసమగ్ర సర్వేతో రైతుల సమస్యలకు పరిష్కారం లభిస్తుంద న్నారు. కొత్త రెవెన్యూ చట్టం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. సమావేశంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గెల్లి అర్చనరవి, వైస్‌చైర్మన్‌ జక్కుల నాగేశ్వరరావు, చిట్యాల అమర్‌నాధ్‌రెడ్డి, జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, మీసాల కిరణ్‌కుమార్‌ పాల్గొన్నారు.


అదేవిధంగా మఠంపల్లిలో జరిగిన మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడారు. కొత్త చట్టం ద్వారా భూఆక్రమణలు, కబ్జాదారుల నుంచి భూములను రక్షించుకోవచ్చని అన్నారు. సమావేశంలో ఎంపీపీ ముడావత్‌ పార్వతి, జడ్పీటీసీ జగన్‌నాయక్‌, ఎంపీడీవో జానకిరాములు, ఇన్‌చార్జి తహసీల్దార్‌ జయశ్రీ పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఎంపీడీవో కార్యాలయం ఎదుట సీపీరోడ్లకు శంకుస్థాపన చేశారు. 

Updated Date - 2020-09-13T09:41:28+05:30 IST