స్వచ్ఛ తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యేలు

ABN , First Publish Date - 2020-10-03T10:43:06+05:30 IST

స్వచ్ఛ తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు ..

స్వచ్ఛ తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యేలు

దేవరకొండ/మిర్యాలగూడ/ అక్టోబరు 2: స్వచ్ఛ తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు  అన్నారు.  శుక్రవారం  బహిరంగ మరుగుదొడ్లను దేవరకొండలో రవీంద్రకుమార్‌, మిర్యాలగూడ లో భాస్కర్‌రావు ప్రారంభించి మాట్లాడారు. . తెలంగాణ ప్రభుత్వం పనితీరుకు నిదర్శనంగా ఆరేళ్లలో  మూడు పర్యాయాలు తెలంగాణకు స్వచ్ఛభారత్‌ అవార్డు వచ్చిందని తెలిపారు.  పట్టణాలను పరిశుభ్రంగా ఉంచేందుకు సులభ్‌ కాంప్లెక్స్‌లను నిర్మిస్తున్నామన్నారు.  ఈ కార్యక్రమాల్లో  దేవరకొండ మునిసిపల్‌ చైర్మన్‌ ఆలంపల్లి నర్సింహ, జడ్పీటీసీ మారేపాకల అరుణసురే్‌షగౌడ్‌,  దేవరకొండ మునిసిపల్‌ కమిషనర్‌  పూర్ణచందర్‌రావు, మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్‌సింగ్‌, మునిసిపల్‌ చైర్మన్‌ తిరునగరు భార్గవ్‌, మునిసిపల్‌ కమిషనర్‌ చీమ వెంకన్న, కౌన్సిలర్లు పాల్గొన్నారు.  


బీఎల్‌ఆర్‌ బ్రదర్స్‌ ఆధ్వర్యంలో..

మిర్యాలగూడ టౌన్‌: మిర్యాలగూడలోని  బంగారుగడ్డ ఈద్గాలో  బీఎల్‌ఆర్‌ బ్రదర్స్‌ సంస్థ ఆఽధ్వర్యంలో స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈద్గా ప్రాంగాన్ని సంస్థ సభ్యులు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు శుభ్రం చేశారు.  సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మదర్సాకు రూ.1 లక్ష, ఈద్గా అభివృద్ధికి రూ.4 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కేతావత్‌ శంకర్‌నాయక్‌, మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్‌రెడ్డి,  కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-03T10:43:06+05:30 IST