ధరణిలో పొరపాట్లు లేకుండా చూడాలి : ఎమ్మెల్యే మల్లయ్య

ABN , First Publish Date - 2020-11-07T10:02:24+05:30 IST

ధరణి ద్వారా లబ్ధిదారులకు అందించే రిజిస్ట్రేషన్‌ పత్రాలలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అధికారులకు సూచించారు

ధరణిలో పొరపాట్లు లేకుండా చూడాలి : ఎమ్మెల్యే మల్లయ్య

నడిగూడెం / మునగాల / కోదాడ , నవంబరు 6 : ధరణి ద్వారా లబ్ధిదారులకు అందించే రిజిస్ట్రేషన్‌ పత్రాలలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అధికారులకు సూచించారు. తహసీల్దార్‌ కార్యాలయంలో ధరణి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను శుక్రవారం పరిశీలించారు. మండలంలో నలుగురు రైతులకు చెందిన రిజిస్ట్రేషన్లను పరిశీలించారు. ప్రభుత్వ ప్రతిష్ఠ పెంచేలా ఒక్క రోజులోనే రిజస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయ్యేలా సేవలు అందించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ యాతాకుల జ్యోతిమధుబాబు, సర్పంచ్‌ గడ్డం నాగలక్ష్మీమల్లే్‌షయాదవ్‌, గుజ్జా అనసూరమ్మ, ఉన్నారు. మునగాల మండలం మాధవరం, నేలమర్రి గ్రామాల్లో ఎమ్మెల్యే ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్‌ ప్రారంభించి, మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎలక బిందు, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ సుంకర అజయ్‌కుమార్‌, సొసైటీ చైర్మన్లు కందిబండ సత్యనారాయణ, తొగరు సీతారాములు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు తొగరు రమేష్‌, వైస్‌ఎంపీపీ కొలిశెట్టి బుజ్జి పాపయ్య, నేలమర్రి, మాదారం సర్పంచ్‌లు జలగం సోమయ్య, నంద్యాల విజయలక్ష్మి పాల్గొన్నారు. కోదాడ ఏరియా ఆస్పత్రిలో ఎక్స్‌రే ల్యాబ్‌ను ఆయన ప్రారంభించి, మాట్లాడారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ వనపర్తి శిరీషాలక్ష్మినారాయణ, టీఆర్‌ఎస్‌ నాయకులు, వైద్యులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-07T10:02:24+05:30 IST