సామాజిక సేవలో పాలుపంచుకోవాలి : ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2020-12-07T05:29:52+05:30 IST
సామాజిక సేవలో పాలుపంచుకోవాలని కోదాడ ఎమ్యెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు.

కోదాడ, డిసెంబరు6: సామాజిక సేవలో పాలుపంచుకోవాలని కోదాడ ఎమ్యెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. అనంతగిరి, కోదాడ మండలాల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ల్యాప్‌టాప్‌లు అం దజేశారు. చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అంద జేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో చేతన ఫౌండేషన్ నిర్వహకులు వేనేగల్ల రవి, పసుమర్తి రంగరావు, నెల్లూరి సీతారామరావు, రావూరి రాజేందర్,ముత్తవరపు రవి, ఎంపీపీ చింతా కవితారెడ్డి, ఎంఈవో సలీంషరీఫ్ పాల్గొన్నారు.