ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత : ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2020-11-27T05:48:45+05:30 IST
ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత సాధ్యమవుతుందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు.

కోదాడ, నవంబరు 26 : ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత సాధ్యమవుతుందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. బోడిగుట్టపై లింగమంతుల స్వామి ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో గురువారం పాల్గొని మాట్లాడారు. ప్రతి ప్రాచీన దేవాలయానికి చరిత్ర ఉందని ; నియోజకవర్గంలోని దేవాలయాలకు పూర్వవైభవం తీసుకొస్తానన్నారు. అంతకుముందు వేదపండితులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ చింత కవితారెడ్డి, కౌన్సిలర్ రమానిరంజన్, యాదవ సంఘ నాయకులు ఈదుల కృష్ణయ్య, కట్టెబోయిన శ్రీనివాస్, గుండెల సూర్యనారాయణ, కల్లూరి పద్మజ, గుండపనేని పద్మావతి, గుండపనేని నాగేశ్వరరావు, నరేష్, ఉపేందర్ పాల్గొన్నారు.