మిక్సోపతిని ఒప్పుకోం.. నేడు ప్రైవేట్‌ ఆస్పత్రుల బంద్‌

ABN , First Publish Date - 2020-12-11T06:11:36+05:30 IST

కేంద్ర ప్రభుత్వం అల్లోపతి, ఆయుర్వేద వైద్యాలను కలుపుతూ నూతనంగా తెచ్చిన మిక్సోపతి వైద్యాన్ని వ్య తిరేకిస్తూ ప్రైవేట్‌ ఆస్పత్రుల నిర్వాహకులు ఉద్యమబాట పట్టారు.

మిక్సోపతిని ఒప్పుకోం..  నేడు ప్రైవేట్‌ ఆస్పత్రుల బంద్‌

 ఉదయం 6నుంచి సాయంత్ర 6గంటల వరకు మూసివేత
 కోవిడ్‌, ఎమర్జెన్సీ కేసులకు మాత్రమే వైద్యసేవలు



నల్లగొండ అర్బన్‌, డిసెంబరు 10 : కేంద్ర ప్రభుత్వం అల్లోపతి, ఆయుర్వేద వైద్యాలను కలుపుతూ నూతనంగా తెచ్చిన మిక్సోపతి వైద్యాన్ని వ్య తిరేకిస్తూ ప్రైవేట్‌ ఆస్పత్రుల నిర్వాహకులు ఉద్యమబాట పట్టారు. దేశవ్యాప్త పిలుపు మేరకు ఈ నెల 11న జిల్లాలోని అన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులు అత్యవసర సేవలు మినహా ఉదయం 6గంటల నుంచి సాయంత్ర 6గం టల వరకు బంద్‌ చేసి నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఆయుర్వేదాన్ని అల్లోపతి వైద్యశాస్త్రంలో కలపాలని కేంద్రం ఉత్తర్వులు జారీ చే యడం సరికాదని పేర్కొంటున్నారు. ఆయుర్వేద పోస్టు గ్రాడ్యూయేట్లను అల్లోపతి సర్జికల్‌ విధానాలతో శిక్షణ పొందడానికి అనుమతిస్తే విపరీత పరిణామాలు చోటు చేసుకుంటాయని పేర్కొన్నారు. ఇది ప్రజా ఆరోగ్యానికి ఏమాత్రం క్షేమం కాదని పేర్కొంటున్నారు. కేంద్ర నిర్ణయాన్ని నిరసి స్తూ ప్రైవేట్‌ ఆస్పత్రులు చేపడుతున్న బంద్‌కు ప్రజలు  సహకరించాలని ఐఎంఏ నీలగిరి అధ్యక్షుడు డాక్టర్‌ ఏసీహెచ్‌.పుల్లారావు, డాక్టర్‌ జయప్రకా ష్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో కోరారు.


కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే నూతన మిక్సోపతి విధానం వల్ల ప్రజలు ఆరోగ్యపరంగా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని, ఆరు నెలల్లో శిక్షణ పొందిన ఆయుర్వేద డాక్టర్లను సర్జరీలు చేయడానికి అనుమతించడం సరికాదన్నారు. తొమ్మిదేళ్లు కఠోర శ్రమతో అల్లోపతి వైద్యులు శిక్షణ పొంది సేవలు అందిస్తున్నారని అలాంటిది 6నెలలు శిక్షణ పొందిన ఆయుర్వేద వైద్యులను ఆపరేష న్లు చేసేందుకు అనుమతించడం వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. వైద్య రంగం, వైద్యనిపుణులు ఈ నూతన విధానాన్ని తీవ్రం గా వ్యతిరేకిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం తక్షణమే మిక్సోపతి వైద్యాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. లేనిచో  రాబోయే రోజుల్లో అల్లోపతి వైద్యులంతా ఏకమై కేంద్రంపై ఉద్యమం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.


మిక్సోపతి వైద్యం సరికాదు : మువ్వా రామారావు
మిర్యాలగూడ : కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మిక్సోపతి వైద్యం సరికాదని  ప్రజా సైన్స్‌వేదిక కన్వీనర్‌ డాక్టర్‌ మువ్వా రామారావు అన్నారు. గురువారం స్థానికంగా మాట్లాడుతూ ఈ విధానంతో మేలు కన్నా కీడే ఎక్కు వ జరిగే అవకాశం ఉందన్నారు.  మిక్సోపతిని వ్యతిరేకిస్తూ చేపట్టిన దేశవ్యాప్త ఆస్పత్రుల బంద్‌కు ఐఎంఏ మిర్యాలగూడ పాల్గొంటుందన్నారు. ఆయన వెంట డాక్టర్‌ రాజు, కొండల్‌రెడ్డి, సుదర్శన్‌ ఉన్నారు.

Updated Date - 2020-12-11T06:11:36+05:30 IST