మిషన్‌ భగీరథతో ఇంటింటికీ తాగునీరు

ABN , First Publish Date - 2020-12-11T06:22:59+05:30 IST

మిషన్‌ భగీరథ పథకంతో గ్రామాలు, తండాల్లో ట్యాంకులు నిర్మించి ఇంటింటికి తాగునీరు సరఫరా చేస్తున్నట్లు దేవరకొండ ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ నగేష్‌ తెలిపారు.

మిషన్‌ భగీరథతో ఇంటింటికీ తాగునీరు
అవగాహన కల్పిస్తున్న ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ నగేష్‌

దేవరకొండ, డిసెంబరు 10 : మిషన్‌ భగీరథ పథకంతో గ్రామాలు, తండాల్లో ట్యాంకులు నిర్మించి ఇంటింటికి తాగునీరు సరఫరా చేస్తున్నట్లు దేవరకొండ ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ నగేష్‌ తెలిపారు. గురువారం ఆయన మండలంలోని శాఖవెల్లి గ్రామంలో మిషన్‌ భగీరథ తాగునీటిపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ప్యూరిఫైడ్‌, బోరు నీటికి బదులు ప్రజలందరూ నాణ్యమైన మిషన్‌ భగీరథ నీరు తాగాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఆంజనేయులు, ఉప సర్పంచ్‌ తిరుపతయ్య, వార్డు సభ్యులు ఇస్మాయిల్‌, ఆంజనేయులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-11T06:22:59+05:30 IST