వివాహిత అదృశ్యం: కేసు నమోదు

ABN , First Publish Date - 2020-12-10T06:17:21+05:30 IST

భువనగిరి మండలం హన్మాపురం గ్రామ శివారులో ఓ వివాహిత అదృశ్యమైంది.

వివాహిత అదృశ్యం: కేసు నమోదు
తప్పిపోయిన నిశాదేవి

భువనగిరి రూరల్‌, డిసెంబరు 9:  భువనగిరి మండలం హన్మాపురం గ్రామ శివారులో ఓ వివాహిత అదృశ్యమైంది. భువనగిరి రూరల్‌ ఎస్‌ఐ కె రాఘవేం దర్‌గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌ రాష్ట్రం, గోపాల్‌గంజ్‌ జిల్లా తామే మండలం దంతెవాడ్‌ గ్రామానికి చెందిన భార్యభర్తలు నిశాదేవి, భీమాజీ   బతుకుదెరువుకోసం 10 సంవత్సరాల క్రితం వలస వచ్చి మండలంలోని హన్మాపురం గ్రామ శివారులో గల కోళ్ల ఫారం(ఫౌల్ర్డీఫాం)లో పనిచేస్తూ జీవనం కొనసాగి స్తున్నారు. కాగా మంగళవారం ఫౌల్ర్డీ ఫాం నుంచి బయటకు వెళ్లి బుధ వారం వరకు తిరిగి రాకపోవడంతో ఆమె భర్త భీమాజీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 


Updated Date - 2020-12-10T06:17:21+05:30 IST