ప్లాస్మా దాతల వివరాలకు ‘ఆరోగ్యవేద’.. యాప్‌ను రూపొందించిన మిర్యాలగూడ విద్యార్థి
ABN , First Publish Date - 2020-07-27T18:15:09+05:30 IST
ప్లాస్మా దాతల వివరాలు పొందుపరిచేందుకు మిర్యాలగూడ విద్యార్థి మాశెట్టి సాయివేదప్రకా్‌షను ‘ఆరోగ్య వేద’ పేరుతో యాప్ రూపొందించాడు. పట్టణానికి చెందిన రాజశేఖర్-రమాదేవి దంపతుల కుమారుడైన

అభినందించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
మిర్యాలగూడ టౌన్(ఆంధ్రజ్యోతి): ప్లాస్మా దాతల వివరాలు పొందుపరిచేందుకు మిర్యాలగూడ విద్యార్థి మాశెట్టి సాయివేదప్రకా్‌షను ‘ఆరోగ్య వేద’ పేరుతో యాప్ రూపొందించాడు. పట్టణానికి చెందిన రాజశేఖర్-రమాదేవి దంపతుల కుమారుడైన సాయివేదప్రకాష్ హైదరాబాద్‌లో బీబీఏ చదువుతున్నాడు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్లాస్మా సేకరణపై పత్రికల్లో వచ్చిన కథనాలు చదివి దాతల వివరాలు పొందుపరిచేలా ఓయా్‌పను రూపొందించాడు. తాను తయారుచేసిన యాప్ వివ రాలను ట్విట్టర్‌లో పోస్టు చేయగా; గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ స్పందించారు. కరోనా చికిత్సలో కీలకమైన ప్లాస్మా థెరపీలో ముందుకు వచ్చే దాతల కోసం ప్లాస్మాతో పాటు రక్తదాతల వివరాలు పొందుపర్చే యాప్‌ను రూపొందించడం ఆదర్శనీయమని ట్వీట్ చేశారు. యాప్ రూపకర్త సాయివేద ప్రకా్‌షతో గవర్నర్ శనివారం ఆన్‌లైన్లో మా ట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వేదప్రకాష్ రూపొందించిన యాప్ కొవిడ్ నిబంఽ దనల మేరకు ప్రభుత్వ అనుమతి పొందాల్సి ఉంది. యాప్ రూపకల్పనపై గవర్నర్ అభినందనలు తెలపటంతో విద్యార్థి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నా కృషికి ఫలితం దక్కింది: సాయివేదప్రకాష్
ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్న కొవిడ్-19 బాధితులకు యాప్ ద్వారా నావంతుగా సహాయం అందించడం ఆనందంగా ఉంది. ప్లాస్మా థెరపీ గురించి ఓ ఆర్టికల్ చదివాను. సాంకేతిక అంశాలపై ఆసక్తి ఉన్నందున యాప్ రూపొందించాలని భావించి ఆ దిశగా ముందుకు వెళ్లాను. యాప్ తుదిరూపునకు చేరుకోగానే ప్రధాని మోదీ, గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి, కేటీఆర్‌లను టాగ్ చేస్తూ ట్విట్టర్ పోస్ట్‌చేశా. గవర్నర్ స్పందించి నాతో మాట్లాడటంతో నా కృషికి ఫలితం దక్కింది. సూచనల మేరకు రాజ్‌భవన్ అఫీషియల్ మెయిల్‌కు వివరాలు పంపా.