లక్ష ఇవ్వాల్సిందే!

ABN , First Publish Date - 2020-09-25T07:47:24+05:30 IST

మిర్యాలగూడ మునిసిపల్‌ కార్యాలయంలో అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిన పనిచేస్తూ సస్పెండ్‌కు గురైన ఓ మహిళా ఉద్యోగిని మెప్మా పీడీ

లక్ష ఇవ్వాల్సిందే!

లంచం డిమాండ్‌ చేసిన మెప్మా పీడీ ఆడియో వైరల్‌


రామగిరి, సెప్టెంబరు 24 : మిర్యాలగూడ మునిసిపల్‌ కార్యాలయంలో అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిన పనిచేస్తూ సస్పెండ్‌కు గురైన ఓ మహిళా ఉద్యోగిని మెప్మా పీడీ లంచం డిమాండ్‌ చేస్తున్న ఆడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది. ఆమె 2017లో సస్పెండ్‌కు గురికాగా, విధుల్లోకి తీసుకోవాలని 2019 జూలై నెలలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయినా మెప్మా పీడీ పలు కొర్రీలు పెడుతూ విధుల్లోకి తీసుకోవడం లేదని ఆమె ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఆమెను రూ.లక్ష డిమాండ్‌ చేస్తున్న ఆడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ విషయమై పీడీని ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా, ఆడియో రికార్డులను కోర్టు సాక్ష్యంగా తీసుకోదుకదా అన్నారు. హైకోర్డు 86 జీవో మేరకు ఉద్యోగంలోకి తీసుకోవాలని ఉత్తర్వులు ఇచ్చిందని, అయితే ఆ జీవో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు చెల్లదని కోర్టుకు నివేదించా అన్నారు. కోర్టు తీర్పును తాను అమలు చేయలేదని అనిపిస్తే ధిక్కరణ కేసుగా మళ్లీ కోర్టుకు వెళ్లవచ్చు, పేపర్లో రాయిస్తే ఏమొస్తదని పేర్కొనడం గమనార్హం.

Updated Date - 2020-09-25T07:47:24+05:30 IST