తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు
ABN , First Publish Date - 2020-12-19T05:55:15+05:30 IST
వచ్చే వేసవిలో మండలంలో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటామని ఎంపీపీ చెన్ను అనురాధ అన్నారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో మిషన్ భగీరథ పనులపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎస్‌ఈ సురేష్ మాట్లాడారు.

పెద్దవూర ఎంపీడీవో కార్యాలయంలో మిషన్ భగీరథ సమీక్షా సమావేశంలో ఎస్‌ఈ సురేష్
పెద్దవూర, డిసెంబరు 18: వచ్చే వేసవిలో మండలంలో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటామని ఎంపీపీ చెన్ను అనురాధ అన్నారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో మిషన్ భగీరథ పనులపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎస్‌ఈ సురేష్ మాట్లాడారు. మండ లంలో మిషన్ భగీరధ పథకంలో ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంక్ పనులన్నీ పూర్తయ్యాయని అన్నారు. గ్రామాల్లో అంతర్గత పైప్‌లైన్లు, క్షేత్రస్థాయిలో మిగిలిన పనులన్నీ రెండు, మూడు వారాల్లో పూర్తి చేసి గ్రామాగ్రామాన తాగునీటి సరఫరా చేస్తామన్నారు. మండలాన్ని యూనిట్‌గా తీసు కుని అన్ని గ్రామాలకు తాగునీటి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామ పంచాయతీల వారీ గా పథకంలో చేయాల్సిన పనులు, చేపట్టాల్సిన పనులపై సమీక్షించారు. కార్యక్రమంలో ఎంపీపీ సలహాదారుడు సుందర్‌రెడ్డి, ఎంపీడీవో దుబ్బ శ్యాం, ఈఈ మోహన్‌రెడ్డి, మిషన్ భగీరధ గ్రిడ్ ఈఈ నిరంజన్, ఏఈలు దీక్షిత్, వెంకట్, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.
తాగునీటి ఎద్దడి సమీక్షా సమావేశానికి ప్రజాప్రతినిధులు డుమ్మా
తాగునీటి ఎద్దడి నివారణపై చర్చించేందుకు పెద్దవూర ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశానికి మహిళా సర్పంచ్‌ల స్థానంలో భర్తలే హాజరయ్యారు. ఈ సమావేశానికి మండలంలోని 26 మంది సర్పంచులు హజరుకావాల్సి ఉంది. అయితే 15 మంది మాత్రమే హాజరయ్యారు. అయితే ఈ 15 మందిలో ఏడుగురు మహిళా సర్పంచ్‌ల స్ధానంలో భర్తలు, ఓ కుమార్తె స్థానంలో తండ్రి, ఓ తల్లి స్థానంలో కుమారుడు హజరై ఆయా గ్రామ సమస్యలను అధికారులకు వివరించారు. మహిళా సర్పంచుల స్థానంలో హాజరైన భర్తలు తమ గ్రామ సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చి సమావేశం ముగియక ముందే వెళ్లిపోయారు. మొత్తం 13 మంది ఎంపీటీసీలు సమావేశానికి హాజరుకావాల్సి ఉండగా ముగ్గురు మాత్రమే వచ్చారు. మండలానికి సమీపంలో కృష్ణానది ప్రవహిస్తూనే ఉన్నా ప్రజలు ఫ్లోరైడ్ జలా లనే తాగుతున్నారని పలువురు ప్రజాప్రతి నిధులు తెలిపారు. మిషన్ భగీరథ పథకం లో ఇంటింటికీ కృష్ణా జలాలు ఇస్తామన్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆరేళ్లుగా నిర్మాణ పనులు చేస్తున్నప్పటికీ ఇప్పటికీ గ్రామాల్లో పనులు నత్తనడకన సాగుతున్నాయని పలువురు సర్పంచ్‌లు తెలిపారు. తాగునీటి సమ స్యలతో మండలంలో ప్రజలు ఇబ్బందులు పడు తున్నా పలువురు ప్రజాప్రతినిధులు సమా వేశాలకు హాజరుకాకపోవడంతోవిమర్శలు వినిపి స్తున్నాయి.
