మాస్క్‌ల తయారీకి చర్యలు తీసుకోవాలి
ABN , First Publish Date - 2020-04-07T09:54:34+05:30 IST
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా గ్రామాలు, పట్టణాల్లో మాస్క్‌ల తయారీకి

నల్లగొండ జిల్లా కలెక్టర్ పీజే.పాటిల్
ధాన్యం కొనుగోలు కట్టుదిట్టంగా చేపట్టాలి
యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్
నల్లగొండ టౌన్ / భువనగిరి రూరల్, ఏప్రిల్6 : కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా గ్రామాలు, పట్టణాల్లో మాస్క్‌ల తయారీకి చర్యలు తీసుకోవడంతో, దీంతో కలిగే ప్రయోజనాలను తెలపాలని కలెక్టర్ పీజే పాటిల్ మండల అభివృద్ధి అధికారులు, మునిసిపల్ కమిషనర్లను ఆదేశించారు. సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి మాస్క్‌ల తయారీ, నర్సరీల నిర్వహణ, మొక్కల సంరక్షణ, ఉపాధి హామీ పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ నియంత్రణకు ముఖ్యంగా మాస్క్‌లు వాడాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ తెలిపిందన్నారు. అంతేగాక గ్రామాల్లో, పట్టణాల్లో మాస్క్‌లు తయారు చేయాలని ప్రభుత్వం ఆదేశించినందున గ్రామాలు, మునిసిపాలిటీల్లో మాస్క్‌ల తయారీకి మహిళా స్వయం సహాయక, మెప్మా సంఘాలతో చర్యలు చేపట్టాలని సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్‌రెడ్డి, జడ్పీ సీఈఓ వీరబ్రహ్మచారి, పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు తిరుపతయ్య, మాధవి తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ వనమాల చంద్రశేఖర్ అధికారులతో కలిసి నల్లగొండ పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డులో గల చౌక ధరల దుకాణాన్ని తనిఖీ చేశారు. అదేవిధంగా యాదాద్రిభువనగిరి కలెక్టర్ అనితారామచంద్రన్ తహసీల్దార్లు, మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కట్టుదిట్టంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.