శాస్త్రోక్తంగా మత్స్యగిరి స్వామి బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2020-11-27T06:14:41+05:30 IST

మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు గరుడ ధ్వజ ప్రతిష్ట, పల్లకీ ధ్వజారోహణ బలిప్రదానం దేవతాహ్వానం హోమక్రతువులు, భేరీ తాండవంతో గురువారం శాస్త్రోక్తంగా ఆరంభమయ్యాయి.

శాస్త్రోక్తంగా మత్స్యగిరి స్వామి బ్రహ్మోత్సవాలు
గరుడ మద్దను అందుకుంటున్న అర్చకులు

వలిగొండ, నవంబరు 26: మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు గరుడ ధ్వజ ప్రతిష్ట, పల్లకీ ధ్వజారోహణ బలిప్రదానం దేవతాహ్వానం హోమక్రతువులు, భేరీ తాండవంతో గురువారం శాస్త్రోక్తంగా ఆరంభమయ్యాయి. లోక కల్యాణం విశ్వశాంతి కోసం ముక్కోటి దేవతలకు నిలయంగా మత్యాద్రి ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. యాగశాలకు ద్వారతోరణార్చన జరిపి ఆగమ శాస్త్రరీతిలో బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు ధ్వజారోహణ ఘట్టం జరిగింది. ముక్కోటి దేవతలను ఆహ్వానించడానికి శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుడ్మంతుడిని ఆహ్వానించడానికి ధ్వజారోహణ తంతును అర్చకులు జరిపారు. ఈ నేపథ్యంలో గరుఢుడిని ఆహ్వానించడానికి గరుఢ ముద్దను ఎగురవేశారు. అనంతరం స్వామిని పలకిపై ఊరేగించారు.



Updated Date - 2020-11-27T06:14:41+05:30 IST