మాస్క్‌లు ధరిస్తేనే పెట్రోల్, రేషన్
ABN , First Publish Date - 2020-03-27T11:22:52+05:30 IST
మాస్క్‌లు ధరిస్తేనే పెట్రోల్, రేషన్
చౌటుప్పల్ రూరల్ మార్చి26: మాస్క్‌లు ధరిస్తేనే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో వాహనదారులకు బంకుల్లో పెట్రోల్ పోస్తున్నారు. . పెట్రోల్ బంక్ నిర్వాహకులు సామాజిక దూరం విధానాన్ని పాటిస్తున్నారు. మాస్క్‌లు ధరించని వాహనదారులను తిరిగి పంపిస్తున్నారు. అదేవిధంగా రెండుమీటర్ల సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు.
రేషన్ దుకాణాల్లో..
పభుత్వం ఉచిత రేషన్ బియ్యం పంపిణీని గ్రామాల్లో రేషన్ దుకాణాల్లో గురువారం ప్రారంభించారు. రేషన్ దుకాణాల వద్ద ప్రజలు గుమి కూడకుండా సామాజిక దూరం విధానాన్ని పాటింపజేశారు. మాస్క్‌లు, కర్చీ్‌ఫలు ధరించిన వారికే బియ్యం అందిస్తున్నారు. గురువారం కొన్ని రేషన్ దుకాణాల్లో టోకెన్లు అందించగా, కొన్ని దుకాణాల్లో బియ్యం పంపిణీ చేశారు.