మద్యం కేసుల్లో పలువురి అరెస్ట్‌

ABN , First Publish Date - 2020-05-18T10:01:05+05:30 IST

యాదాద్రి భువనగిరి జిల్లా రాజా పేట మండలం బేగంపేటలో, తుర్కపల్లి పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని కోనాపూర్‌ రోడ్డులో ..

మద్యం కేసుల్లో పలువురి అరెస్ట్‌

రూ. 55 వేల విలువైన మద్యం స్వాధీనంరాజాపేట/తుర్కపల్లి  మే 17: యాదాద్రి భువనగిరి జిల్లా  రాజా పేట మండలం బేగంపేటలో, తుర్కపల్లి పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని కోనాపూర్‌ రోడ్డులో భువనగిరి ఎస్‌ఓటీ పోలీసులు ఆదివారం దాడులు చేశారు. ఐదుగురిని అరె్‌స్టచేసి రూ.55వేల విలువైన మద్యాన్ని స్వాధీ నం చేసుకున్నారు. బేగంపేట గ్రామంలో బెల్ట్‌షాపులో మద్యం విక్రయిస్తున్న నెమిల పాండు, టి.రాజయ్యను అరెస్ట్‌ చేసి రూ.20 వేల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బేగంపేటలో ఆటోలో తరలిస్తున్న రూ.35వేల విలువైన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోనాపూర్‌రోడ్డులో బెల్ట్‌షాపు నిర్వహిస్తున్న బి.బాలమ్మ, ఆటో డ్రైవర్‌ బి.నర్సింహ, వైన్స్‌ షాపు యజమాని సునీతపై కేసు నమోదు చేశారు. బాలమ్మ, నర్సింహను అరెస్ట్‌ చేసినట్లు, సునీత పరారీలో ఉన్న ట్లు తుర్కపల్లి ఎస్‌ఐ యాదగిరి తెలిపారు. 


దేవరకొండ: దేవరకొండ ఎక్సైజ్‌ సర్కిల్‌ పరిధిలో ఎక్సైజ్‌ సిబ్బంది  దాడులు చేసి సారా, బెల్లాన్ని స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్ట్‌ చేశారు. నిందితుల కారును కూడా ఎక్సైజ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నేరేడుగొమ్ము మండలం ఉప్పుగంటితండాకు చెందిన మెగావత్‌ రాజును అరెస్ట్‌చేసి 10 లీటర్ల నాటుసారా, నేనావత్‌ అంజి, రమావత్‌ శివ, కేతావత్‌ రమే్‌షను అరెస్ట్‌ చేసి 600 కిలోల బెల్లం, 40 కిలోల పటిక, కారును స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌  వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. 


ఆలేరు రూరల్‌: ఆలేరు మండలం గుండ్లగ్రామం వద్ద గుడుంబాను విక్రయించేయత్నం చేసిన శివలాల్‌తండాకు చెందిన కేతావత్‌ వెంకటేష్‌ను ఆలేరు పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. ఎనిమిది లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ రమేష్‌ తెలిపారు.

Updated Date - 2020-05-18T10:01:05+05:30 IST