కలెక్టర్ పాటిల్ మానవత్వం
ABN , First Publish Date - 2020-11-25T05:53:45+05:30 IST
ద్విచక్ర వాహనం అదుపుతప్పి తీవ్రంగా గాయపడిన మహిళను సకాలంలో ఆసుపత్రికి తరలించిన నల్లగొండ కలెక్టర్ ఆమె ప్రాణం కాపాడారు.

గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలింపు
డిండి, నవంబరు 24: ద్విచక్ర వాహనం అదుపుతప్పి తీవ్రంగా గాయపడిన మహిళను సకాలంలో ఆసుపత్రికి తరలించిన నల్లగొండ కలెక్టర్ ఆమె ప్రాణం కాపాడారు. నల్లగొండ జిల్లా డిండి మండలంలో మంగళవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. డిండి రిజ ర్వాయ ర్‌లో రొయ్య పిల్లలు వదిలే కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ప్రశాంత్ జీవ్‌నాటిల్ జిల్లాకేంద్రానికి బయలుదేరారు. అదే సమయంలో డిండి మండలం చెర్కుపల్లి గౌరారం మార్గమధ్యలో రోడ్డుపై ద్విచక్రవా హనం అదుపుతప్పి రోడ్డుపై పడడంతో రాజేశ్వరి మహిళ తలకు తీవ్రగా య మైంది. ఆ సమయంలో అటుగా వస్తున్న కలెక్టర్ తన వాహనాన్ని ఆపి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. గాయపడిన మహిళను పోలీ సులు తమ వాహనంలో దేవరకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిం చారు. కలెక్టర్ సకాలంలో స్పందించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మహిళకు ప్రమాదం తప్పిందని ఆర్డీవో గోపీరాం తెలిపారు.