నోముల కుటుంబానికి మంత్రి జగదీష్‌రెడ్డి పరామర్శ
ABN , First Publish Date - 2020-12-10T05:56:46+05:30 IST
దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య కుటుంబాన్ని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి నకిరేకల్‌లోని నోముల నివాసంలో బుధవారం పరామర్శించారు.

హాలియా/ వేములపల్లి, డిసెంబరు 9: దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య కుటుంబాన్ని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి నకిరేకల్‌లోని నోముల నివాసంలో బుధవారం పరామర్శించారు. నోముల చిత్రపటానికి నివాళులర్పించారు. అదేవిధంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు తనయుడు సిద్ధార్ధ నోముల కుటుంబాన్ని పరామర్శించారు. వారి వెంట ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఉన్నారు. ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుటుంబాన్ని వేములపల్లి మండల టీఆర్‌ఎస్ నాయకులు పరామర్శించారు. నోముల నర్సింహయ్య స్వగ్రామమైన నకిరేకల్ మండల పాలంలో నోముల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు పగిళ్ల సైదులు, కాకునూరి వెంకన్నగౌడ్, కుందూరు యాదగిరిరెడ్డి, నాగరాజు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.