మంచు కురిసె... మనసు మురిసె
ABN , First Publish Date - 2020-11-21T06:24:07+05:30 IST
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లిని శుక్రవారం ఉదయం 9గంటల వరకు మంచు దుప్పటి కమ్మేసింది

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లిలోని పంటపొలాలపై ఉదయం 9గంటల సమయంలోనూ కురుస్తున్న మంచు
ఉదయం 9గంటల వరకు మంచు తెరలు
భూదాన్‌పోచంపల్లి/నడిగూడెం, నవంబరు 20: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లిని శుక్రవారం ఉదయం 9గంటల వరకు మంచు దుప్పటి కమ్మేసింది. పొలాలు, రహదారిపై మంచు తెరలతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. వరిపొలాలు, రహదారులను మంచు కమ్మేసింది. కార్తీక మాసం ఆరంభం కాగా, వాహనాలపై దేవాలయాలకు వెళ్లే భక్తులు, ద్విచక్ర వాహనదారులు లైట్లు వేసి ప్రయాణం సాగించారు.
