రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2020-12-19T05:30:00+05:30 IST

మండలంలోని అంగడిపేట ఎక్స్‌ రోడ్డు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

పెద్దఅడిశర్లపల్లి, డిసెంబరు 19: మండలంలోని అంగడిపేట ఎక్స్‌ రోడ్డు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. గుడిపల్లి పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని సింగరాశిపల్లికి చెందిన బోయ కేశవరెడ్డి(36) అంగడిపేట ఎక్స్‌రోడ్డు నుంచి సింగరా శిపల్లికి బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో మేకలవారిగూడెం నుంచి బైక్‌పై మొర శ్రీనయ్య, మేకల మల్లయ్య వస్తున్నారు. ఎక్స్‌రోడ్డు వద్ద రెండు బైకులు అదుపు తప్పి ఢీ కొన్నా యి. దీంతో ముగ్గురికి గాయా లయ్యాయి.  వారిని వెంటనే 108 వాహనంలో ముగ్గురిని దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయప డిని కేశవరెడ్డిని హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెం దాడు. కేశవ రెడ్డికి భార్య, కొడుకు, కూమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 నార్కట్‌పల్లి : మండలకేంద్రం శివారు వివేరా హోటల్‌ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయపడ్డాడు. మండలంలోని గోపలాయపల్లి గ్రామానికి చెందిన అక్కెనపల్లి యాదయ్య నార్కట్‌పల్లిలోని రాశీ కంపెనీకి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కామినేనిలో ప్రాథమిక చికిత్స చేసి తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. 


ఆర్‌ఎంపీని బెదిరించి డబ్బులు వసూలు 

చిట్యాల రూరల్‌, డిసెంబరు 19: విలేకరులమని వైద్యుడిని బెది రించి డబ్బులు వసూలు చేసిన నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ రావుల నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మండ లంలోని పెద్దకాపర్తికి చెందిన ఆర్‌ఎంపీ కిరణ్‌కు చెందిన క్లినిక్‌లో ఇతర ప్రాంతానికి చెందిన యాదగిరి అనే వైద్యుడు వైద్యం చేస్తుం టాడు. చిట్యాలకు చెందిన విలేకరులు సతీష్‌, సంపత్‌, శేఖర్‌తో పాటు భువనగిరికి చెందిన సాయి పెద్దకాపర్తిలోని క్లినిక్‌కు వెళ్లారు. వైద్యం కాకుండా క్లినిక్‌లో లింగనిర్థారణ పరీక్షలు చేస్తున్నారని పత్రికల్లో వార్త రాయకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని బెదిరించారు. భయప డిన ఆర్‌ఎంపీ కిరణ్‌ వారికి రూ.50వేలు ఇచ్చాడు. ఈ విషయమై కిరణ్‌ చిట్యాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 


గంజాయి పట్టివేత 

నార్కట్‌పల్లి, డిసెంబర్‌ 19: నార్కట్‌పల్లిలోని కామినేని వై జంక్షన్‌ వద్ద శనివారం సాయంత్రం ఎస్‌ఐ బి.యాదయ్య తన సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. మండల పరిదిలోని పల్లెపాడుకు చెందిన బొంత చంద్రమౌలి, బొంత శరత్‌ చంద్ర, బొంత లక్ష్మమ్మ కామినేని వైపు నుంచి అనుమానాస్పదంగా వస్తుండగా ముగ్గురుని పట్టుకుని, తనిఖీ చేయగా వారి వద్ద రెండు కేజీల గంజాయి దొరికిందని ఎస్‌ఐ తెలిపారు. ముగ్గురిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామన్నారు. 


గుర్తుతెలియని వ్యక్తి మృతి

చింతపల్లి, డిసెంబరు 19: మండలంలోని కుర్మేడు గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం శనివారం కనిపించింది. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కుర్మేడు గ్రామానికి చెందిన అల్వాల జంగయ్య పొలం వద్ద శనివారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి  మృతదేహం పూర్తిగా కాలిపోయి ఉంది. సంఘ టనా స్థలంలో పెట్రోల్‌ డబ్బా పడి ఉంది. సాయంత్రం పొలం వద్దకు వెళుతున్న జంగయ్యతోపాటు మరికొంత మంది గ్రామస్థులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఆత్మహత్యకు పాల్పడ్డాడా, హత్య చేశారా అనుమానం వ్యక్తవుతోంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 


పొదుపు, మోసాల్లో కొత్త కోణాలు

కనగల్‌, డిసెంబరు 19: మండలంలోని తుర్కపల్లి గ్రామ పొదుపు సంఘంలో వీబీకే చేసిన భారీ మోసంలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. పొదుపు సంఘాల మహిళల నుంచి రూ.64లక్షలు కాజేసిన వీబీకే ఇటీవల నల్లగొండలో ఇల్లు, ప్లాట్లు కొనుగోలు చేసి నట్లు తెలిసింది. తుర్కపల్లి పొదుపు సంఘాల్లో అవినీతి వెలుగు చూడడంతో పలు గ్రామాల్లోని మహిళా సంఘాల సభ్యులు భయపడుతున్నారు. తాము కూడా ఇదే తరహాలో మోసపోతున్నా మని ఆందోళనలో ఉన్నారు. ప్రత్యేక దృష్టి సారించి అధికారులు, బ్యాంకు సిబ్బంది విచారణ చేస్తే మోసాలు వెలుగు చూసే అవకాశా లున్నాయని పేర్కొంటున్నారు. మండల పరిధిలోని సాగర్‌రోడ్డు వెంట గల ఓ గ్రామపంచాయతీ వీబీకే  ఇటీవల చేసిన అక్రమాలు బయట పడంతో ఆమెను పక్కన పెట్టారు. పొదుపు సంఘాల మహిళలను మోసగిస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి.

Read more