విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2020-12-16T05:14:05+05:30 IST
మండలంలోని వేపలసింగారంలో విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి చెందాడు.

హుజూర్‌నగర్, డిసెంబరు 15: మండలంలోని వేపలసింగారంలో విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన తోకల సైదులు(30) పొలం పనులకు వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చాడు. ఇంటి పక్కనే ఉన్న పొలంలో మోటార్ వద్ద బకెట్‌లో నీళ్ళుపడుతున్న సమయంలో విద్యుత్ వైర్లు తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పేద కుటుంబాన్ని ఆదుకోవాలని సర్పంచ్ అన్నెం శిరీషాకొండారెడ్డి కోరారు.