‘మల్లారెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలి’

ABN , First Publish Date - 2020-12-27T06:03:40+05:30 IST

అనేక భూ కబ్జాలకు పాల్పడడమే కాకుండా తన ఇంజనీరింగ్‌ కళాశాలలో మోసపూరిత చర్యలకు పాల్పడిన కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిని మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్‌ చేయాలని మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ బర్రె జహాంగీర్‌ ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి దర్గాయి హరిప్రసాద్‌, యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు పడిగెల ప్రదీప్‌ డిమాండ్‌ చేశారు.

‘మల్లారెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలి’
భువనగిరిలో మంత్రి మల్లారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తున్న నాయకులు

యాదాద్రి, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): అనేక భూ కబ్జాలకు పాల్పడడమే కాకుండా తన ఇంజనీరింగ్‌ కళాశాలలో మోసపూరిత చర్యలకు పాల్పడిన కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిని మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్‌ చేయాలని మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ బర్రె జహాంగీర్‌ ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి దర్గాయి హరిప్రసాద్‌, యూత్‌ కాంగ్రెస్‌  రాష్ట్ర నాయకులు పడిగెల ప్రదీప్‌ డిమాండ్‌ చేశారు. శనివారం స్థానిక అంబేద్కర్‌ చౌరస్తా వద్ద యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మంత్రి మల్లారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో నాయకులు కొల్లూరు రాజు మనోజ్‌ మహేందర్‌, బురాన్‌, మసూద్‌, చిస్తీ, మచ్చ నర్సింహా, కౌసర్‌, ప్రకాశ్‌, నరేష్‌, సాయి, సిద్దార్థ, ఉపేందర్‌, నరేష్‌, గ్యాస్‌ చిన్నా, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-27T06:03:40+05:30 IST