జాతీయ రహదారిపై లారీ దగ్ధం

ABN , First Publish Date - 2020-12-10T06:14:36+05:30 IST

చౌటుప్పల్‌ మండలం దండుమ ల్కాపురం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి ప్రమాదవశాత్తు ఓ లారీ దగ్ధమైంది.

జాతీయ రహదారిపై లారీ దగ్ధం
దగ్ధమవుతున్న లారీ

చౌటుప్పల్‌ రూరల్‌, డిసెంబరు 9: చౌటుప్పల్‌ మండలం దండుమ ల్కాపురం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి ప్రమాదవశాత్తు ఓ లారీ దగ్ధమైంది.  హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీ మల్కాపురం వద్ద రోడ్డు దాటు తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిం ది. దీంతో ద్విచక్రవాహనం పెట్రోల్‌ ట్యాంక్‌ పగిలి, ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే లారీకి మంట లు అంటుకొని ఎగిసిపడ్డాయి. ఈ మంటల్లో లారీ పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్‌ చాకచ క్యంగా లారీలోంచి బయట దూకి ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ద్విచక్రవాహ నాదారుడు పిల్ల మల్లయ్య తీవ్ర గాయాలకు గురయ్యాడు. స్థానికులు ఆయనను ఆసుపత్రికి తరలిం చారు. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమా పక సిబ్బంది సంఘటన స్థాలానికి చేరుకొని మంటలను ఆర్పినప్పటికీ అప్పటికే లారీ పూర్తిగా దగ్ధమైంది. సీఐ వెంకన్న సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.


Updated Date - 2020-12-10T06:14:36+05:30 IST