జీవకోటి మనుగడకు మొక్కలే ఆధారం
ABN , First Publish Date - 2020-07-08T10:07:35+05:30 IST
జీవకోటి మనుగడకు మొక్కలే ఆధారమని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు.
రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్
సూర్యాపేట టౌన్ / సూర్యాపేట రూరల్ / ఆత్మకూర్(ఎస్) / కోదాడ / నేరేడుచర్ల, జూలై 7: జీవకోటి మనుగడకు మొక్కలే ఆధారమని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. సూర్యాపేట జిల్లాకేంద్రంలోని 25, 26వ వార్డుల్లో హరితహారంలో భాగంగా ఆయన మొక్కలు నాటి మాట్లాడారు. వాతావరణ సమతుల్యతకోసం సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. పచ్చదనంతోనే పర్యావరణం పరిరక్షణ సాధ్యపడుతుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి.సంజీవరెడ్డి, మునిసిపల్ చైర్‌పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివా్‌సగౌడ్, వైస్‌చైర్మన్ పుట్ట కిషోర్, నాయకులు పాల్గొన్నారు. మొక్కలను కంటికి రెప్పలా సంరక్షించాలని జడ్పీ సీఈవో ఎల్.విజయలక్ష్మి అన్నారు. సూర్యాపేట మండల పరిధిలోని జాతీయ రహదారి వెంట ఇరువైపులా మూడు వరుసలలో నాటుతున్న మొక్కలను పరిశీలించారు. ఆమెవెంట ఎంపీడీవో శ్రీనివా్‌సరావు, సర్పంచ్ పిండిగ పద్మ నాగేందర్ ఉన్నారు.
ఆత్మకూర్(ఎస్) మండలం పాత సూర్యాపేట గ్రామంలో జడ్పీ వైస్‌చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్ మొక్కలు నాటి మాట్లాడుతూ మానవాళికి చెట్లు ఎంతో అవసరమన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో విజయలక్ష్మి, ఎంపీపీ స్వర్ణలతాచంద్రారెడ్డి, వైస్‌ఎంపీపీ వెంకన్న, పీఏసీఎస్ చైర్మన్ కొణతం సత్యనారాయణరెడ్డి, వైస్‌చైర్మన్ జానయ్య, సర్పంచ్‌లు అలివేలు సంజీవరెడ్డి, మీరా, రవీందర్, మంగ్యా, సుందర్ పలువురు పాల్గొన్నారు. హరితహారంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోదాడ ముసిసిపల్ చైర్మన్ వనపర్తి శిరీషాలక్ష్మినారాయణ ఆకాంక్షించారు. శ్రీరంగాపురంలో హైవేకు ఇరువైపులా మొక్కలు నాటారు. కార్యక్రమంలో కమిషనర్ మల్లారెడ్డి, అంకుశవలీ, లక్ష్మణ్‌నాయక్, దండుశ్రీను, పి.యాదగిరి, సత్యనారాయణ, రాజయ్య, రామారావు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచాలని నేరేడుచర్ల మునిసిపల్ చైర్మన్ జయబాబు అన్నారు.
నేరేడుచర్లలో ఇంటింటికీ మొక్కలను పంపిణీ చేశారు. అదేవిధంగా స్థానిక మండల వనరుల కేంద్రంలో ఎంఈవో చత్రునాయక్ మొక్కలను నాటారు. కార్యక్రమంలో వైస్‌చైర్మన్ శ్రీలతారెడ్డి, కమిషనర్ రాంరెడ్డి, మేనేజర్ అశోక్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు మధు, శ్రీనివాస్, పలువురు కౌన్సిలర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ముమ్మరంగా హరితహారం : కలెక్టర్
చిలుకూరు, జూలై 7: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహార కార్యక్రమం జిల్లావ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతోందని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి చెప్పారు. చిలుకూరు మండలంలోని కొండాపురం, మాధవగూడెం, బేతవోలు గ్రామాల్లో మంగళవారం పర్యటించారు. ఆయా గ్రామాల్లో నర్సరీలు, వైకుంఠధామాలు, చెత్త డంపింగ్‌యార్డులను పరిశీలించారు.
హరితహారంలో భాగంగా రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటిస్తున్నామని, అదేవిధంగా ప్రతి ఇంట్లో మొక్కలు నాటాలని సూచించారు. ఆయనవెంట ఎంపీపీ ప్రశాంతి కోటయ్య, తహసీల్దార్ శ్రీనివా్‌సశర్మ, ఎంపీడీవో ఈదయ్య, సర్పంచ్‌లు, చంద్రకళ, నాగయ్య, సుగుణమ్మ, నర్సింహారావు, మాదాసు లింగయ్య, ఎంపీటీసీ బుడిగె సైదమ్మ, ఏపీఎం రమణాకర్, ఏపీవో నిర్మల, గ్రామకార్యదర్శులు పాల్గొన్నారు.