వైభవంగా లక్ష్మీనారాయణ స్వామి రథోత్సవం

ABN , First Publish Date - 2020-03-12T07:03:03+05:30 IST

పట్టణంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం బుధవారం

వైభవంగా లక్ష్మీనారాయణ స్వామి రథోత్సవం

భూదాన్‌పోచంపల్లి, మార్చి11 : పట్టణంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం బుధవారం వైభవంగా నిర్వహించారు. పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్‌ స్వామి మంగళశాసనాలతో యజ్ఞాచార్యులు నల్లాన్‌ చక్రవర్తుల రాఘవాచార్యులు, మరింగంటి లక్ష్మీనారాయణాచార్యులు, ఉత్తలూ రు హిమాంశురాయ్‌, ఆలయ అర్చకులు మరింగంటి గిరిధరాచార్యులు ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీ పాంచరాత్ర ఆగమ, ద్రా విడ, వేద ప్రబంధ పారాయణాదులతో శాస్త్రోక్తంగా నిర్వహించారు.


ఉత్సవాల్లో భాగంగా బుధవారం దేవాలయంలో ఆరాధన, ప్రాబోధకి, హోమం, బలిహరణం, పూర్ణాహుతి, ధ్వజపట ఉద్వాసన, చక్రవరి, నేవేదన హారతి, తీర్థప్రసాద గోష్ఠి, పుష్పయాగం, దేవతోద్వాసన, ద్వాదశ ఆరాధన, ఏకాంత సేవ సప్త అవరాణాల తీర్థ ప్రసాదాలు నిర్వహించారు. స్వామి వారి రథోత్సవం, ఊరేగింపు మే ళతాళ మృదంగ మంగళ వాయిద్యాలతో తిరపతి కోలా ట కళాబృందం - జలాల్‌పూర్‌ వారితో భక్తిరస విన్యాసములతో నిర్వహించిన కోలాట ప్రదర్శనలు భక్తులను అలరించాయి.


ఉత్సవాల్లో ఆలయ కమిటీ చైర్మన్‌ సం గెం చంద్రయ్య, మాజీ చైర్మన్‌ గుణిగంటి వల్లే్‌షగౌడ్‌, మున్సిపల్‌ కౌన్సిలర్‌ మోటె రజితరాజు, దోతిగూడెం స ర్పంచ్‌ పగిల్ల స్వప్నరాంరెడ్డి, గ్రంథాలయ చైర్మన్‌ సీ తాభాస్కర్‌, సిల్కు యారన్‌ అధ్యక్షుడు గుండు పరమే ష్‌, ప్రధాన కార్యదర్శి సూరపల్లి రవీందర్‌, కూరపాటి స్వామి, విఠల్‌, బుచ్చిరెడ్డి, రమేష్‌, రామసాని చంద్రశేఖర్‌రెడ్డి, నర్సింహ, ధర్మకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-12T07:03:03+05:30 IST