వైభవంగా లక్ష్మీ పూజలు
ABN , First Publish Date - 2020-12-19T05:50:09+05:30 IST
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో శుక్రవారం లక్ష్మీపూజలు వైభవంగా కొనసాగాయి.
యాదాద్రి టౌన్, డిసెంబరు 18: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో శుక్రవారం లక్ష్మీపూజలు వైభవంగా కొనసాగాయి. వేకువజామునే ప్రధానాలయంలోని స్వయంభువులను ఆరాధించిన అర్చకులు బాలాలయ కవచమూర్తులను సువర్ణ పుష్పాలతో అర్చించారు. అనంతరం ఉత్సవమూర్తుల నిత్యతిరుకల్యాణ వేడుకలు నిర్వహించారు. సాయంత్రం వేళ బాలాలయంలో కొలువుదీరిన ఆండాళ్ అమ్మవారిని ఆరాధిస్తూ ఊంజల్ సేవ నిర్వహించారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ దర్శంచుకున్నారు.