పాత పద్ధతిలోనే భూరిజిస్ర్టేషన్లు కొనసాగించాలి
ABN , First Publish Date - 2020-12-20T05:22:42+05:30 IST
వ్యవసాయ, వ్యవసాయేతర భూము ల రిజిస్ర్టేషన్లు పాత పద్ధతిలోనే కొనసాగించాలని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

నల్లగొండ టౌన్, డిసెంబరు 19 : వ్యవసాయ, వ్యవసాయేతర భూము ల రిజిస్ర్టేషన్లు పాత పద్ధతిలోనే కొనసాగించాలని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎల్‌ఆర్‌ఎ్‌సపై ప్రభుత్వం అంలంబిస్తున్న వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పట్టణ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు శనివారం జిల్లాకేంద్రంలో బైక్ ర్యాలీ తీసి క్టాక్‌టవర్ సెంటర్‌లో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిజిస్ర్టేషన్ల ప్రక్రి య మూతపడి వంద రోజులైనా ముందుకు సాగట్లేదన్నారు. ప్రభుత్వ సీఎస్ సోమే్‌షకుమార్ కరోనా కాలంలో ప్రజలపై ఎల్‌ఆర్‌ఎస్ భారాన్ని మోపి రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేశారన్నారు. వెంటనే సీఎ్‌సను డిస్మిస్ చేయడంతో పాటు, పాత పద్ధతిలోనే రిజిస్ర్టేసన్లు కొనసాగించాలని డిమాండ్ చేశారు. దీనిపై ఈ నెల 21న జిల్లాకేంద్రంలో పెద్దఎత్తున ర్యాలీ తీసి కలెక్టర్, రిజిస్ర్టార్, జిల్లా మంత్రికి వినతిపత్రాలు అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు నందికొండ శ్రీను, మాదగోని శంకర్, బోతనపు స్వామి, మొరిశెట్టి నాగేశ్వర్‌రావు, పోలె శ్రీను, నరేష్, అప్సర్, యాదయ్య, పంతంగి రమేష్, శ్రీను పాల్గొన్నారు.