భూ సమస్యలు సివిల్ కోర్టులో పరిష్కరించుకోవాలి
ABN , First Publish Date - 2020-12-15T06:46:52+05:30 IST
భూ సంబంధిత సమస్యలు రెవెన్యూ పరిధిలో లేనందున సివిల్ కోర్టు ద్వారానే పరిష్కరించుకోవాలని కలెక్టర్ అనితా రామచంద్రన్ అన్నారు.

కలెక్టర్ అనితారామచంద్రన్
భువనగిరి రూరల్, డిసెంబరు 14: భూ సంబంధిత సమస్యలు రెవెన్యూ పరిధిలో లేనందున సివిల్ కోర్టు ద్వారానే పరిష్కరించుకోవాలని కలెక్టర్ అనితా రామచంద్రన్ అన్నారు. సోమవారం కలెక్టర్ ఫోన్ ఇన్ ప్రోగ్రాం నిర్వహించగా 19 సమస్యలపై అర్జీ లు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల నుంచి ప్రతి సోమవారం అందే సమస్యలకు అధికారులు సత్వరమే స్పందించాలని ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్య పథకాలను వందశాతం పూర్తి చేసి, లక్ష్యాన్ని అధిగమించాలని కలెక్టర్ అనితా రామచంద్రన్ అదేశించారు. మండల కోఆర్డినేటింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. రైతు వేదికల నిర్మాణాలు, వైకుంఠ దామాలు, పల్లె ప్రకృతివనాల పనుల ప్రగతిపై మండలాల వారిగా సమీక్షించారు. గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని నర్సరీల ప్రాధాన్యతపై అధికారులకు వివరించారు.