కేసీఆర్ యూటర్న్ బాధాకరం: చెరుపల్లి
ABN , First Publish Date - 2020-12-30T06:12:09+05:30 IST
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించిన కేసీఆర్ యూటర్న్ తీసుకొని అనుకూలంగా ప్రకటనలు చేయడం బాధాకరమని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు అన్నారు.
చౌటుప్పల్ టౌన్, డిసెంబరు 29: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించిన కేసీఆర్ యూటర్న్ తీసుకొని అనుకూలంగా ప్రకటనలు చేయడం బాధాకరమని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు అన్నారు. చౌటుప్పల్ పట్టణంలో మంగళవారం సీపీఎం మండల విస్తృత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీతారాములు మాట్లాడుతూ తక్షణమే వ్యవసాయ చట్టాల అనుకూల ప్రకటనలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్, మునిసిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, నాయకులు చింతల భూపాల్‌రెడ్డి, బూరుగు కృష్ణారెడ్డి, జి.లక్ష్మణ్‌గౌడ్ పాల్గొన్నారు.
భూదాన్‌పోచంపల్లి : భూదాన్‌పోచంపల్లి పరిధిలోని నారాయణగిరి గ్రామంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఉరితాళ్లతో నిరసన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు వెంకటేష్, సామల సత్తిరెడ్డి, గూడూరు రాంరెడ్డి, దుబ్బాక జగన్, పగడాల శివ, గూడూరు కృష్ణారెడ్డి, పక్కీర్‌రెడ్డి, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శివారెడ్డిగూడెంలో రైతు సంఘం ఆధ్వర్యంలో దహనం చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కోట రాంచంద్రారెడ్డి పాల్గొన్నారు.
రామన్నపేట: రామన్నపేటలో స్థానిక సుభాష్ సెంటర్‌లో సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్‌రెడ్డి, సీపీఎం మండల కార్యదర్శి జెల్లెల పెంటయ్య, జిల్లా కమిటీ సభ్యుడు బొడ్డుపల్లి వెంకటేశం, సీఐటీయూ జిల్లా నాయకులు మామిడి వెంకట్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ నాగటి ఉపేందర్, మండల నాయకులు బోయిని ఆనంద్ పాల్గొన్నారు.
బీబీనగర్ : రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసి విద్యుత్ ప్రైవేటీకరణ ఆపాలని బీబీనగర్‌లో సీపీఎం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల ప్రయోజనం కొరకు రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చిందన్నారు. కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణ, శ్రీరాములు, శ్రవణ్, భాను, శివ, భరత్, పోచయ్య పాల్గొన్నారు.