కేసీఆర్ శిఖండిలా వ్యవహరిస్తున్నారు
ABN , First Publish Date - 2020-12-30T05:27:12+05:30 IST
రైతుల ఉద్యమం పట్ల కేసీఆర్ శిఖండిలా వ్యవహరిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి
నేరేడుచర్ల/ సూర్యాపేటటౌన్/ అర్వపల్లి/ మునగాల/ కోదాడ రూ రల్/ తుంగతుర్తి, డిసెంబరు 29: రైతుల ఉద్యమం పట్ల కేసీఆర్ శిఖండిలా వ్యవహరిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. నేరేడుచర్లలో మంగళవారం విలేకరుల తో మాట్లాడారు. కేంద్రం పెట్టే కేసులకు భయపడిపడి నల్లచట్టాలకు తల వంచుతున్నారన్నారు. సమావేశంలో రవినాయక్, నగేష్, అనంతప్రకాష్, వెంకటయ్య పాల్గొన్నారు. రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తామ ని ప్రకటించిన సీఎం కేసీఆర్ మాటమార్చారని సీపీఐ నాయకుడు ధూళిపాళ ధనుంజయనాయుడు ఆరోపించారు. నేరేడుచర్లలో మాట్లాడారు. సూర్యాపేటలో సీపీఎం నాయకులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహ నం చేశారు. నూతన వ్యవసాయ చట్టాలను సమర్థిస్తూ సీఎం కేసీఆర్ మాట్లాడడం దుర్మార్గమని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి అన్నారు. కార్యక్రమంలో నాయకులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, కోటగోపి, వెంకట్‌రెడ్డి, శ్రీకాంత్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ కేంద్రాలను శాశ్వతంగా తొలగించాలనే నిర్ణయం సరికాదని సీపీఐ(ఎంఎల్) జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్‌కుమార్ అన్నారు. సీపీఎం నాయకులు అర్వపల్లిలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందజే శారు. కార్యక్రమంలో వజ్జె శ్రీనివాస్, వెంకన్న, మల్లయ్య, యాకలక్ష్మి, నర్స య్య, వజ్జె సైదయ్య పాల్గొన్నారు. ప్రభుత్వాలు కుమ్మక్కై రైతులను మో గిస్తున్నాయని ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధానకార్యదర్వి యరగాని నాగన్నగౌడ్ అన్నారు. హుజూర్‌నగర్‌లో జరిగిన సమావేశంలో మా ట్లాడారు. సమావేశంలో బెల్లంకొండ గురవయ్య, రామ్మూర్తి, రామరాజు, ముక్కంటి, జానయ్య ఉన్నారు. మునగాలలో కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో చేశా రు. కార్యక్రమంలో కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు బచ్చు అశోక్, పందిరి నాగిరెడ్డి, ఎలక నరేందర్‌రెడ్డి, వేమూరి సత్యనా రాయణ పాల్గొ న్నారు. కోదాడ, తుంగతుర్తిలో సీపీఎం నాయకులు తహసీల్దార్లకు వి నతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు మిట్టగణుపుల ముత్యాలు, దాసరి శ్రీనివాస్, కొలిశెట్టి యాదగిరిరావు, శ్రీనివాస్ పాల్గొన్నారు.