కనగల్ ఎక్స్‌రోడ్డులో వరుస చోరీలు
ABN , First Publish Date - 2020-12-17T06:20:38+05:30 IST
మండల కేంద్రమైన కనగల్ ఎక్స్‌రోడ్డులో జరుగుతున్న వరుస దొంగతనాలు స్థానికులకు కంటిమీద కనుకు లేకు ండా చేస్తున్నాయి.

ప్రజలకు తప్పని జాగారాలు ఫ పట్టించుకోని అధికారులు
కనగల్, డిసెంబరు 16: మండల కేంద్రమైన కనగల్ ఎక్స్‌రోడ్డులో జరుగుతున్న వరుస దొంగతనాలు స్థానికులకు కంటిమీద కనుకు లేకు ండా చేస్తున్నాయి. పోలీ్‌సస్టేషన్‌కు కూత వేటు దూరంలోనే దొంగలు రెచ్చిపోయి మరీ దొంగతనాలకు పాల్పడుతుండటం విశేషం. ఎక్స్‌రోడ్డుకు చెందిన షేక్ షాహిన్ ఇంటికి తాళం వేసి హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి వెళ్లింది. నాలుగు రోజుల తర్వాత బుధవారం ఇంటికి తిరిగి రాగ తలుపులకు వేసిన తాళం తీసి ఉంది. అనుమానంతో లోపలికి వెళ్లి పరిశీలించిగా బీరువా తలుపులు తీసి ఉన్నాయి. అందులోని రూ.20వేల నగదు, రెండు తులాల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలు కనిపించలేదు. దీంతో దొంగతనం జరిగిందని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మంగళవారం రాత్రి విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదురుగా ఉన్న గ్రోమోర్ ఎరువుల దుకాణం రెండు షటర్లను పగలగొట్టి లోనికి ప్రవేశించిన దొంగ లు దొంగతనానికి విఫలయత్నం చేసారు. దుకాణంలో ఏమి లభించకపోవటంతో ఉట్టి చేతులతో వెనుదిరిగారు. కనగల్ ఎక్స్‌రోడ్డులో దొంగతనాలు తరుచూ జరుగుతున్న నేపథ్యంలో ఇటీవల షాపు యజమానుల సంఘం ఆధ్వర్యంలో ఎక్స్‌రోడ్డులో ప్రధాన రహదారి వెంట పోలీసులు సీసీ కెమరాలు ఏర్పాటు చేసారు. అయినప్పటికీ దొంగలు చాకచక్యంతో దొంగతనాలకు పాల్పడుతూ చిక్కటం లేదు. దీంతో సీసీ కెమెరాలు ఉన్నా ఆశించిన ప్రయోజనం దక్కట్లేదు. దీనికితోడు పోలీసులు అప్రమత్తంగా లేకపోవటంతో పోలీస్‌స్టేషన్‌కు కూతవేటులోనే దొంగతనాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు.