జూదరుల అరెస్టు.. రూ.61వేలు స్వాధీనం

ABN , First Publish Date - 2020-12-11T05:52:25+05:30 IST

ఆత్మకూరు(ఎం) మండలకేంద్రంలో పేకాట ఆడుతున్న జూదరులను భువనగిరి ఎస్వోటీ పోలీసులు గురువారం పట్టుకున్నారు.

జూదరుల అరెస్టు.. రూ.61వేలు స్వాధీనం
పట్టుబడిన జూదరులు

ఆత్మకూరు(ఎం),డిసెంబరు 10: ఆత్మకూరు(ఎం) మండలకేంద్రంలో పేకాట ఆడుతున్న జూదరులను భువనగిరి ఎస్వోటీ పోలీసులు  గురువారం పట్టుకున్నారు. మండల కేం ద్రంలోని ఓ ఫంక్షన్‌హా ల్‌ సమీపంలో ఏడుగురు పేకా ట ఆడుతున్నట్లు సమాచారం తెలుసుకున్న పోలీసులు దాడిచేసి పట్టుకున్నారు. వారి నుంచి రూ.61వేల నగదు, కారు, రెండు బైక్‌లు, 8 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ఆత్మకూరుకు చెందిన కొసన శ్రీశైలం, బూడిది క్రిష్ణ, ఎలగందుల స్వామి, గడ్డం వెంకట్‌, పల్లపు రాజు, భువనగిరి మండలం అనంతారం గ్రామానికి చెందిన పల్లెపాటి లింగం, మూటకొండూరు మండలం నాంచారిపేట గ్రామానికి చెందిన గంగధారి నర్సింహ ఉన్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఎండి.ఇద్రి్‌సఅలీ తెలిపారు.


Updated Date - 2020-12-11T05:52:25+05:30 IST