ఎంజీయూలో ముగిసిన జాబ్‌మేళా

ABN , First Publish Date - 2020-03-13T11:59:50+05:30 IST

పట్టణ పరిధిలోని అన్నెపర్తిలో ఉన్న ఎంజీ యూ ప్రధాన క్యాంప్‌సలో గురువారం శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూషన్స్‌ ఆధ్వర్యంలో

ఎంజీయూలో ముగిసిన జాబ్‌మేళా

నల్లగొండ, మార్చి 12: పట్టణ పరిధిలోని అన్నెపర్తిలో ఉన్న ఎంజీ యూ ప్రధాన క్యాంప్‌సలో గురువారం శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూషన్స్‌ ఆధ్వర్యంలో క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఈ జాబ్‌మేళాకు సుమారు 200 మందికి పైగా హాజరయ్యారు. మొదటి దశలో పరీక్ష నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం డెమో నిర్వహించారు. ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 21వ తేదీన నియామాక పత్రాలు అందజేస్తామని ఆ సంస్థ అకడమిక్‌ కో ఆర్డినేటర్‌ సీహెచ్‌. శ్రీనివాస్‌ ఆనంద్‌, నాగేంద్ర తెలిపారు.


ఎంజీయూ ప్లేస్‌మెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వై. ప్రశాంతి మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన మరో సారి జాబ్‌మేళా నిర్వహిస్తామని, బీఈడీ అభ్యర్థులు అధికంగా పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో శ్రీ చైతన్య హైస్కూల్‌ హెచ్‌ఎం బందా జోసఫ్‌, జబ్బార్‌, అధ్యాపకులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-13T11:59:50+05:30 IST