అమరుల ఆశయ సాధనే లక్ష్యం : బాలకృష్ణారెడ్డి

ABN , First Publish Date - 2020-11-27T06:05:46+05:30 IST

అమరుల ఆశయ సాధనే లక్ష్యంగా పోరాటం సాగిస్తామని యువ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి అన్నారు.

అమరుల ఆశయ సాధనే లక్ష్యం : బాలకృష్ణారెడ్డి
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న బాలకృష్ణారెడ్డి

నల్లగొండ క్రైం, నవంబరు 26 : అమరుల ఆశయ సాధనే లక్ష్యంగా పోరాటం సాగిస్తామని యువ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌  జిల్లా ఉపాధ్యక్షుడు గుండ్లపల్లి బంగారయ్య సుమారు 200మందితో కలిసి జిట్టా సమక్షంలో గురువారం పార్టీలో చేరారు.  ఈ సందర్భంగా బాల కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దశాబ్ద కాలంగా ఎవరు పోరాటం చేశారో ప్రజలందరికి తెలుసన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో హక్కుల సాధనకు ప్రస్తుతం పోరాటాలు సాగించాల్సిన పరిస్థితి నె లకొందన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా ప్రజా సంక్షేమమే పరమావధిగా ప్ర ణాళికతో ముందుకు సాగుతామన్నారు. బంగారయ్య మాట్లాడుతూ యువతకు పార్టీలో ప్రా ధాన్యం కల్పిస్తూ జిల్లాలో పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు అహర్నిశలు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాణి రుద్రమ, కొండ కృష్ణ, బచ్చలకూరి మధు, అజయ్‌కుమార్‌, రమేష్‌, సైదులు, సతీష్‌, శంకర్‌, సమ్లికాన్‌, కోటేష్‌, రమేష్‌, కార్తీక్‌, వెంకన్న, పవన్‌ పాల్గొన్నారు. 

Read more