ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది

ABN , First Publish Date - 2020-02-08T10:58:16+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ప్ర భుత్వ వైద్యంపై ప్రజల్లో విశ్వాసం పెరిగే విధంగా మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నట్లు విద్యుత్‌

ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది

సూర్యాపేట(కలెక్టరేట్‌), ఫిబ్రవరి 7: తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ప్ర భుత్వ వైద్యంపై ప్రజల్లో విశ్వాసం పెరిగే విధంగా మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నట్లు విద్యుత్‌ శాఖమంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వార్డులను పరిశీలించి రోగులతో వైద్య సేవల విషయమై మాట్లాడారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ ఆ సుపత్రులల్లో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటూ రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని ఆదేశించారు. ప్రభుత్వ వైద్య విద్య అభ్యసించాలంటే చేతిలో డబ్బులు ఉన్న వారికే వీలు పడేదని ప్రస్తుతం సీఎం కేసీఆర్‌ పట్టుదలతో ప్రభుత్వ మెడికల్‌ కళాశాలను ఏర్పాటు చేయించార ని కొనియాడారు. సీఎం కేసీఆర్‌ సారథ్యంలో సంచలనాత్మకంగా సూర్యాపేటలో మెడికల్‌ కళాశాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని దాని ద్వారా సూర్యాపేట జిల్లా ప్రజలకు హైదరాబాద్‌ తరహా వైద్య సేవలందుతున్నాయని పేర్కొన్నారు. అన్ని రంగాల అభివృద్ధితో పాటు ప్రజలకు ప్రధానంగా వైద్యం, విద్య ఎంతో అవసరమని అందుకోసం ఆ రెండు రంగాలకే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు. ఆసుపత్రిలో ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న అదనపు పడకల భవనాన్ని పరిశీలించారు. మంత్రి వెంట మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, జనరల్‌ ఆసుపత్రి సూపరిండెంట్‌ డాక్టర్‌ దండా మురళీదర్‌రెడ్డి, మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ శారద, గండూరి ప్రకాష్‌ ఉన్నారు. 


Updated Date - 2020-02-08T10:58:16+05:30 IST