సాగర్‌ ఉప ఎన్నిక ఏకగ్రీవమైతే మంచిది

ABN , First Publish Date - 2020-12-28T06:14:27+05:30 IST

నాగార్జునసాగర్‌ నియోజకవర్గ ఉప ఎన్నికలో ఎమ్మెల్యేను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే మంచి సంప్రదా య అవుతుందని మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

సాగర్‌ ఉప ఎన్నిక ఏకగ్రీవమైతే మంచిది
మాట్లాడుతున్న సుఖేందర్‌రెడ్డి

మద్దతు ధర విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకోవాలి 

శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి


నల్లగొండ, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నాగార్జునసాగర్‌ నియోజకవర్గ ఉప ఎన్నికలో ఎమ్మెల్యేను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే మంచి సంప్రదా య అవుతుందని మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో గతంలో రాగ్యానాయక్‌ను నక్సల్స్‌ హత్య చేస్తే ఆయన భార్య భారతిని ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంప్రదాయం ఉం దన్నారు. నాడు, తాను టీడీపీలో ఉండగా, చంద్రబాబు సూచన మేరకు అందరితో మాట్లాడి ఒప్పించి నాటి ఉప ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నించానని గుర్తు చేశారు. ప్రస్తుతం ఇంకా రెండున్నర ఏళ్ల సమయమే మిగిలి ఉన్నందున సాగర్‌ విషయంలో ఇతర పార్టీల పెద్దలు సహకరిస్తే మంచిదన్నారు. తాను సాగర్‌ ఉప ఎన్నికల బరిలో లేనని, ప్రస్తుతం రాజ్యాంగబద్ధ పదవిలో తృప్తిగా ఉన్నానన్నారు. మద్దతు ధర విషయంలో కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకోవాలని మనసారా కోరుకుంటున్న ట్లు చెప్పారు. రైతులతో కేంద్రం చర్చలు సఫలం కావాలన్నారు. పప్పు ధాన్యాలను కేంద్రమే కొనుగో లు చేయాలని, ఆయిల్‌ ఉత్పత్తులపై ప్రోత్సాహకాలను పెంచాలన్నారు. ఉత్తరాది రాష్ట్రాల రైతులకు కొత్త వ్యవసాయ చట్టాలతో పెను నష్టం జరు గుతోందని, అందు కే ఎముకలు కొరికే చలిలోనూ వారు పోరాడుతున్నారన్నారు. విద్యుత్‌ చట్టసవరణ బిల్లులతో తెలంగాణలో 24 గంటల ఉచిత సరఫరాకు ఆటంకం ఏర్పడిందన్నారు. ప్రధాని మోదీ మొండిగా వ్యవహరించడం తగదని, దేశంలో 75 శాతం మంది ఉన్న రైతులను కన్నీరు పెట్టించడం బాగాలేదన్నారు. ఉత్తర భారతంలో మద్దతు ధరలేక రైతులు నష్టపోతున్నారన్నారు. ఉత్తరప్రదేశ్‌ నుంచి క్విం టా ధాన్యం రూ.1530, కర్ణాటక రాయచూర్‌ నుంచి రూ.1650కే కొనుగోలు చేసి మన జిల్లాకు తరలిస్తున్నారని ఆయన తెలిపారు.

Updated Date - 2020-12-28T06:14:27+05:30 IST